బీజేపీ హ్యాండిల్ ని మళ్లీ బండికే ఇవ్వబోతున్నారా..?

కేంద్రంలో బీజేపీ ( BJP ) ఉన్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ప్రాంతీయ పార్టీల హవానే కొనసాగుతుంది.

ఉత్తరాదిలో బీజేపీ పార్టీకి,కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత క్రేజ్ దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం ఉండదు.

దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ప్రజలు ప్రాంతీయ పార్టీలకే పట్టం కడుతూ ఉంటారు.అయితే తెలంగాణ పరిస్థితి చూసుకుంటే ఒకప్పుడు తెలంగాణలో బిజెపి అనేది లేకపోయేది.

కానీ ఎప్పుడైతే బండి సంజయ్ ( Bandi Sanjay ) బిజెపి పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసి గెలిచారో అప్పటినుండి బిజెపి పార్టీ అందరికీ తెలిసి వచ్చింది.అంతేకాకుండా 2020లో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పగ్గాలు చేపట్టాక రాష్ట్రంలో బిజెపి క్రేజ్ పెరిగింది అంతేకాదు ఒకానొక సమయంలో ప్రాంతీయ పార్టీగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీని కూడా ఇచ్చింది.

Are You Going To Give The Handle To Bjp Again , Bandi Sanjay Kumar , Brs , Co

ఎన్నికలు మరికొద్ది రోజులు ఉన్నాయి అనే సమయంలో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని తప్పించి కిషన్ రెడ్డి ( Kishan reddy ) కి బాధ్యతలు అప్పగించారు అప్పటినుండి బిజెపి గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది.ఇక ఈసారి ఎన్నికల్లో బిజెపి గ్రాఫ్ పెరుగుతుందనుకున్న సమయంలో పార్టీ అధ్యక్షుడిని మార్చడం వల్ల పార్టీకి ప్రజాదారణ మొత్తం తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు.అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకొని ప్రస్తుతం అధికారంలోకి వచ్చింది.

Are You Going To Give The Handle To Bjp Again , Bandi Sanjay Kumar , Brs , Co
Advertisement
Are You Going To Give The Handle To BJP Again , Bandi Sanjay Kumar , Brs , Co

అయితే బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుండి తొలగించడం వల్లే బిజెపి గ్రాఫ్ తగ్గిపోయింది అని చాలామంది భావించారు.ఇక బిజెపి అధిష్టానం కూడా ఈ తప్పు తెలుసుకున్నారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి భాద్యతలు మోయడం కిషన్ రెడ్డికి సాధ్యం కాదని, బండి సంజయ్ అయితేనే మళ్ళీ రాష్ట్రంలో మొత్తం బిజెపి హవా పెరుగుతుందని భావిస్తున్నారు.

అందుకే మళ్లీ బండి సంజయ్ చేతికే పార్టీ అధ్యక్షుడి భాద్యతలను అప్పగించబోతున్నట్టు సమాచారం.ఇక మరికొద్ది రోజుల్లో లోక్ సభ ( Lokh sabha ) ఎన్నికలున్న నేపథ్యంలో తెలంగాణలో బిజెపి పార్టీ ఎంపి స్థానాలు గెలుపొందాలంటే కచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నికల లోపే మార్చాలని, అలా మార్చితేనే తెలంగాణలో మళ్లీ బిజెపి పార్టీ పుంజుకుంటుందని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మరికొద్ది రోజుల్లోనే బిజెపి పార్టీ అధ్యక్ష పదవిని మళ్ళీ బండి సంజయ్ కి ఇవ్వబోతున్నట్టు సమాచారం.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు