రాత్రి పూట భోజనం ఆలస్యంగా చేస్తున్నారా.. అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే..

సాధారణంగా చాలామంది ప్రజలు మధ్యాహ్నం లంచ్ కంటే రాత్రి డిన్నర్ ని ఎక్కువగా ఇష్టపడతారు.

కానీ రాత్రిపూట తినే భోజనం మన ఆరోగ్యాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తుంది.

ముఖ్యంగా తినే ఆహారం లాగే తినే టైం కూడా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.అందుకే రాత్రి పూట సరైన సమయంలో ఆహారం తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.

కానీ చాలామంది బిజీ జీవన విధానంలో రాత్రిపూట చాలా లేటుగా ఆహారం తింటున్నారు.ఇలా చేస్తే ఊబకాయంతో పాటు అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చాలామంది రాత్రిపూట తిన్నా వెంటనే నిద్రపోతూ ఉంటారు.కానీ అలా అస్సలు చేయకూడదు.

Advertisement

తిన్న వెంటనే నిద్రపోకూడదు.మనం రాత్రి 9 గంటల లోపే తినడం ఎంతో మంచిది.

చాలా మంది రాత్రి 9 తర్వాత తింటారు.తిన్న వెంటనే పడుకుంటున్నారు.

ఇలా పడుకుంటే తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.దీని వల్ల జీర్ణ క్రియ నెమ్మదిగా పనిచేస్తుందని వెల్లడించారు.

ఇలా తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, రక్తం లో ఎక్కువ చక్కెర స్థాయి చేరడం, ఊబకాయం, గుండె జబ్బులు ఉంటే ఎన్నో రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలలో తేలింది.సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య భోజనం చేయడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు రాత్రిపూట ఆలస్యంగా తినే అలవాటు ఎన్నో రోగాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ముఖ్యంగా ఇది జీర్ణశక్తిని కూడా తీవ్రంగా ప్రభావం చేస్తుందని చెబుతున్నారు.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

రాత్రి సమయంలో తినడం ఆలస్యంగా తినడం వల్ల బరువు వేగంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.ఈ అలవాటు నిద్రలేమికి దారితీస్తుంది.ఇంకా చెప్పాలంటే రాత్రి ఆలస్యంగా తినాలనుకుంటే పండ్లను తీసుకోవచ్చు లేదా పాలు తాగవచ్చు.

Advertisement

వీటిని తీసుకున్న వెంటనే నిద్రపోకూడదని కనీసం అరగంటైనా ఆగాలని వైద్యులు చెబుతున్నారు.రాత్రి ఆలస్యంగా జంక్ ఫుడ్ తినడం అసలు మంచిది కాదు.

జంక్ ఫుడ్ ఆలస్యంగా జీర్ణం అయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు