ఇంట్లో మీరు శుభ్రంగా ఉండే వస్తువులు.. అనుకునే వాటిపై ఇన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయా..

ఈ మధ్యకాలంలో ఆరోగ్యంగా ఉండడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారం తినడమే కాకుండా ఇంటిని కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

చాలామంది ప్రతి రోజు ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు.

అయితే కొంతమంది రెండు రోజుల గ్యాప్ తో, మరికొందరు వారం తరువాత శుభ్రం చేస్తుంటారు.చాలామంది ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చిన్న చిన్న విషయాలపై అసలు దృష్టి పెట్టారు.

కానీ రోగాలు రావడానికి ఇవే కారణమవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఓవెన్, కాఫీ మేకర్, డిష్ వాష్ స్పాంజ్ వంటి వాటిలో దుమ్ము, ధూళి, ఫంగస్,జెర్మ్స్ ఎక్కువగా ఉంటాయి.

ఇంట్లో పరిశుభ్రత పాటించని ఈ వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.అమెరికాస్ ఆర్గనైజేషన్ ఫర్ పబ్లిక్ హెల్త్ అండ్ సేఫ్టీ చేసిన పరిశోధన ప్రకారం వంట గదిలో బ్యాక్టీరియా ( Bacteria ) ఎక్కువగా ఉండే వస్తువులలో కాఫీ మేకర్( Coffee Maker ) కూడా ఒకటి అని చెబుతున్నారు.

Advertisement
Are There So Many Types Of Bacteria On The Things You Think Are Clean At Home De

ఈ పరిశోధనలో పరిశోధకులు కాఫీ మేకర్ లోపల 67 రకాల క్రిములను కనుక్కున్నారు.అంటే కాఫీ మేకర్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే ఈ బ్యాక్టీరియా మీ శరీరంలోకి చేరడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలకు గురవుతారు.

Are There So Many Types Of Bacteria On The Things You Think Are Clean At Home De

ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో మనం వినియోగించే పరుపును ( Mattress ) శుభ్రం చేసుకోవడం కూడా ఎంతో ముఖ్యం.ఎందుకంటే వ్యక్తి శరీరం ప్రతిరోజు 1.5 గ్రాముల డెడ్ స్కిన్ ఉత్పత్తి చేస్తుంది.ఇదంతా మనం పడుకునే బెడ్ కి అంటుకుంటుంది.

ఈ కారణంగా వాటిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.అందుకే పరుపులను క్లీన్ చేసుకోవడానికి ఎండలో ఉంచడం మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే షాపింగ్ బ్యాగ్స్ లో కూడా చాలా రకాల బ్యాటరీ ఉంటుంది.

Are There So Many Types Of Bacteria On The Things You Think Are Clean At Home De
మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు దీన్ని తింటే ఏమవుతుందో తెలుసా..?

అందుకోసం కనీసం వారానికి ఒకసారి అయినా షాపింగ్ బ్యాగ్స్ శుభ్రం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే డిష్ వాషింగ్ స్పాంజ్ లో కూడా ఆ ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.ఈ బ్యాక్టీరియా మనుషుల ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

అందుకోసమే కనీసం వారానికి ఒకసారి అయిన వీటిని క్లోరిన్, బీచ్ తో కడగాలని సూచిస్తున్నారు.

తాజా వార్తలు