జగన్ వల్లే ఆ టీవీ ఛానళ్ల రేటింగులు పెరుగుతున్నాయా?

ఇటీవల కాలంలో సీఎం జగన్ తరచూ ఎల్లో మీడియాను ప్రస్తావిస్తున్నారు.ఏ సభ పెట్టినా.

ఏ సమీక్ష పెట్టినా ఎల్లో మీడియాను మాత్రం జగన్ మరిచిపోవడం లేదు.దుష్టచతుష్టయం అంటూ చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 ఛానళ్లను సంభోదిస్తున్నారు.

వీటిలో ఈనాడు మీడియా సంస్థకు పేపర్‌తో పాటు టీవీ ఛానళ్లు కూడా ఉన్నాయి.ఆంధ్రజ్యోతికి కూడా న్యూస్ ఛానల్ ఉంది.

తమ వాడు చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేదనే అక్కసుతో ఆయా ఛానళ్లు తమ ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని జగన్ తెగ బాధపడిపోతున్నారు.అయితే తన ఛానల్ సాక్షిటీవీ ఏం చేస్తుందో మాత్రం ఆయన మరిచిపోతున్నారు.

Advertisement

వైఎస్ జగన్ ఏపీలో అధికారంలోకి వచ్చాక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఛానళ్లు రాకుండా కేబుల్ ఆపరేటర్లతో మంతనాలు జరిపి అనధికారికంగా నిషేధం విధించారు.టీవీ ఛానళ్లను కాబట్టి జగన్ మూయించగలిగారు.

మరి దినపత్రికలను మాత్రం ఆయన ఆపలేరు కదా.ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఆయా ఛానళ్లు తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కడ చూపిస్తాయోనని జగన్ చాలా ఫీలైపోతున్నారు.అయినా తానొకటి తలిస్తే.

దైవం మరొకటి తలచినట్టు సీఎం జగన్, వైసీపీ నేతలు ఎల్లో మీడియా పేరుతో రెండు పత్రికలు, మూడు టీవీ ఛానళ్లను లక్ష్యంగా చేసుకుంటుంటే.ఆ టీవీ ఛానెళ్ల రేటింగులు మాత్రం అమాంతం పెరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కేబుల్ ఆపరేటర్లు ఆయా ఛానళ్ల ప్రసారాలను నిలిపివేసినా డిజిటల్ మీడియాను ఆపడం ఎవరితరం కాదు.దీంతో యూట్యూబ్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఛానళ్లకు వ్యూయర్ షిప్ పెరుగుతున్నట్లు పలువురు మాట్లాడుకుంటున్నారు.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

దీంతో ఆయా టీవీ ఛానళ్ల నిర్వాహకులు యాడ్స్ రెవెన్యూ రూపంలో భారీగానే సొమ్ము చేసుకుంటున్నారు.

Advertisement

జగన్ వల్లే సదరు టీవీ ఛానళ్ల రేటింగ్స్ పెరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.ఏపీలో ఆ ఛానళ్లు రాకపోయినా వేరే చోట్ల ఆయా ఛానళ్లకు ఆదరణ పెరుగుతోందని వివరిస్తున్నారు.గతంలో వైఎస్ఆర్ కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటూ అసెంబ్లీ సాక్షిగా ఆయా పేపర్లలో వచ్చిన కథనాలను చదువుతూ వాటి సర్క్యులేషన్ పెంచేవాళ్లు.

ఇప్పుడు జగన్ కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నాడు.కాకపోతే అప్పుడు రెండే.ఇప్పుడు మాత్రం నాలుగు అయ్యాయి.

అంతే తేడా.

తాజా వార్తలు