వినియోగదారులను మరింత సంతృప్తి పరచడానికి యాపిల్ వాచ్( Apple Watch ) రోజురోజుకీ కొత్త కొత్త అప్డేట్స్ తీసుకు వస్తోంది.
ఇండియాలో ఆపిల్ కి వున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
ఈ నేపథ్యంలో భారత వినియోగదారులకు చక్కటి ఫీచర్ అందుబాటులోకి తీసుకు వచ్చింది.దానితో గుండెకు స్పందలను సంబంధించిన హిస్టరీని చాలా తేలికగా ఇపుడు ట్రాక్ చేయవచ్చు.
ఈ ఫీచర్ ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లకు అందుబాటులో ఉండగా ఇపుడు భారతీయులకోసం తాజా అప్డేట్ తీసుకు వచ్చింది.
తాజా నివేదికల ప్రకారం చూస్తే.భారతీయ ఆపిల్ వాచ్ వినియోగదారులు ఇప్పుడు ఈ ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు.ఇక్కడ AFib అనేది క్రానిక్ హార్ట్ కండిషన్‌ను( Chronic Heart Condition ) తెలియజేస్తుంది.
ఇది ఒక రకమైన అరిథ్మియా అని చెప్పుకోవచ్చు.ఈ క్రమంలో గుండె దడ, వేగంగా కొట్టుకోవడం, క్రమరహితంగా కొట్టుకోవడం వంటివాటిని తెలుసుకొనే వీలుంది.
ఈ పరిస్థితిని సకాలంలో గుర్తించకుండా, సరియైన చికిత్స తీసుకోకుండా ఉంటే మాత్రం గుండె ఆగిపోవడానికి లేదా స్ట్రోక్ సంభవించే క్లాట్స్‌కు దారితీస్తుందనే విషయం తెలిసినదే.అయితే దీనికి సరియైన మందులువాడే వ్యక్తులు ఆరోగ్య కరమైన, చురుకైన జీవితాలను గడపొచ్చు.
అదేవిధంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.
ఇకపోతే యాపిల్ వాచ్ 4,( Apple Watch 4 ) తర్వాత వాచ్ ఏఓస్ 9లోని వినియోగదారులకు మాత్రమే ఈ ఫీచర్ పని చేస్తుందని గుర్తు పెట్టుకోవాలి.ఇండియా ఆపిల్ వాచ్ యూజర్లు ఐఫోన్‌లో ఐఓఎస్ 16ని ఉపయోగించాలి.AFib హిస్టరీ ఖచ్చితంగా 22 ఏళ్లు పైబడిన వినియోగదారులకు మాత్రమే అని యాపిల్ సపోర్ట్ పేజీ స్పష్టంచేసింది, ఈ విషయం గుర్తు పెట్టుకోవాలి.
ఈ ఫీచర్ కోసం ఐఫోన్‌లో హెల్త్‌యాప్ ఓపెన్, బ్రౌజ్ క్లిక్ చేసిన హార్ట్ ఆప్షన్‌ను ఎంచుకోవలసి ఉంటుంది.తరువాత AFib హిస్టరీ సెట్ చేసిన స్టార్ట్ అప్షన్‌పై క్లిక్ చేయాలి.
తరువాత మీ పుట్టిన తేదీని నమోదు చేసి AFibతో బాధపడుతున్నారని వైద్యుడు నిర్ధారించిన వైనాన్ని ధృవీకరించాలి.తరువాత AFib చరిత్ర, ఫలితాలు, లైఫ్ ఫ్యాక్ట్ గురించి మరింత తెలుసుకునేలా కంటిన్యూపై క్లిక్ చేస్తే సరిపోతుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy