YS Sharmila vs Roja : జబర్దస్త్ రోజా.. జబర్దస్త్ దోపిడీ.. రోజాపై కాంగ్రెస్ నేత షర్మిల పంచ్ లు మామూలుగా లేవుగా!

వైయస్ షర్మిల( YS Sharmila ) ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన తర్వాత దూసుకెల్తోంది.వైసీపీ, టీడీపీ అనే తేడా లేకుండా అధికార, విపక్షాలపై విమర్శలు సంధిస్తున్నారు.

టీడీపీతో పోల్చుకుంటే ఎక్కువగా వైసీపీ నే టార్గెట్ చేస్తూ అన్నయ్య జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడుతోంది వైయస్ షర్మిల.అయితే మొన్నటి వరకు వైయస్సార్ షర్మిల ఎలాంటి కామెంట్స్ చేసినా కూడా మౌనంగా ఉన్న వైసీపీ నేతలు ఇప్పుడు షర్మిల ఆరోపణలకు సజ్జల, మంత్రి రోజా, కొడాలి నాని వంటి నేతలు కౌంటర్లు వేస్తున్నారు.

ఈ క్రమంలో నగరిలో పర్యటించిన వైఎస్ షర్మిల స్థానిక ఎమ్మెల్యే, మంత్రి రోజాపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.నగరిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో షర్మిల మాట్లాడుతూ.

గరి ఎమ్మెల్యే జబర్దస్త్ రోజా( Nagari MLA Roja ). నియోజకవర్గంలో అంతా జబర్దస్త్ దోపిడీ.

Advertisement

ఈవిడతో పాటు రోజా అన్నలు, భర్త కలిపి నగరి నియోజకవర్గానికి నలుగురు మంత్రులు.ఇసుక, మట్టి, గ్రావెల్, స్థలాలు ఇలా అన్నీ దోపిడీ.ఎక్కడ చూసినా అవినీతే అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు.

రోజాను ఒకప్పుడు ఐరెన్ లెగ్ అనేవారు.అప్పట్లో వైఎస్ఆర్‌ను పంచె విప్పి కొడతానంటూ ఆమె చేసిన మాటలు గుర్తున్నాయి.

ఇక తన గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు అని అన్నారు షర్మిల.తనను ప్రేమించినంతగా వైఎస్ఆర్ ఎవరినీ ప్రేమించలేదని అన్నారు.

వైఎస్ఆర్‌( YSR )కు గౌరవం లేని చోట తాను ఉండలేనని, కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ అంటే ఉన్న అపారమైన గౌరవంతోనే ఆ పార్టీలో చేరినట్లు చెప్పుకొచ్చింది షర్మిల.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

మరి షర్మిల చేసిన వ్యాఖ్యలపై రోజా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి మరి.కాగా వయసు షర్మిల దెబ్బకు వైసీపీ పార్టీ నిజంగానే భయపడుతోందని చెప్పవచ్చు.జగన్ గురించి జగన్ చేసిన ప్రభుత్వం గురించి అభివృద్ధి గురించి ఎన్ని వ్యాఖ్యలు చేసినా కూడా ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) ఒక మాట కూడా మాట్లాడటం లేదు.

Advertisement

వైసీపీ నేతలు( YCP Leaders ) కూడా షర్మిల గురించి మాట్లాడాలి అంటే బయపడుతున్నారు.

తాజా వార్తలు