ఈరోజు సీఎం జగన్ ఆధ్వర్యంలో అమరావతి లో జరిగిన ఏపీ క్యాబినెట్ మీటింగ్ లో పలు అంశాలపై చర్చించారు.ముఖ్యంగా రాజధాని విషయంలో జీఎన్ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై అనేక రకాలుగా చర్చించారు.
అయితే ఈ భేటీలో రాజధాని విషయంలో ప్రభుత్వం ఇంకా ఒక క్లారిటీ కి రాలేనట్టుగా తెలుస్తోంది.జీఎన్ రావు కమిటీ తోపాటు బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదిక కూడా రావాల్సి ఉండడంతో స్పష్టంగా ఏ నిర్ణయం తీసుకోలేదు.
జనవరిలో ఈ కమిటీ నివేదిక అందజేసే అవకాశం ఉంది.ఈ రెండు కమిటీ నివేదిక వచ్చిన తర్వాత దీనిపై హైలెవల్ కమిటీ వేసి తర్వాత రాజధాని విషయంలో ముందుకెళ్లాలని క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయించారు.
అలాగే 2014 డిసెంబర్ 31 రాజధాని ప్రకటనకు ముందు జరిగిన భూముల కొనుగోళ్లు పై దర్యాప్తు చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.ముఖ్యంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు, కారు డ్రైవర్లు ఇలా ఎవరెవరు అమరావతి పరిసర ప్రాంతాల్లో భూములు కొనుగోళ్లు చేశారు అనే విషయంపై దర్యాప్తు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
అయితే ఈ కొనుగోలు వ్యవహారంపై లోకయుక్త, సిబిఐ, సిబిసిఐడి లను రంగంలోకి దించి నిజాలు నిగ్గు తేల్చాలని చూస్తున్నట్టుగా మంత్రి పేర్ని నాని ప్రకటించారు.
.







