మొక్కజొన్నలతో కాకుండా చికెన్ తో కూడా పాప్ కార్న్ చేసుకోవచ్చు..ఎలాగంటే..!

సాధారణంగా చికెన్ ( Chicken )తో చాలా రకాల వంటకాలను ప్రజలు తయారు చేసుకునీ తింటూ ఉంటారు.

చికెన్ తో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి.

అంతేకాకుండా చికెన్ తో వంటకాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు.చికెన్ తో కూరలు, వేపుడు, బిర్యాని వంటి వాటిని కాకుండా స్నాక్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు.

చికెన్ తో చేసుకోదగిన స్నాక్స్ లో చికెన్ పాప్ కార్న్( Chicken popcorn ) కూడా ఉంది.చికెన్ పాప్ కార్న్ లోపల మెత్తగా, పైన కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటుంది.

Apart From Corns, You Can Also Make Popcorn With Chicken ,corns, Popcorn, Chicke

చికెన్ పాప్ కార్న్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏమిటి! చికెన్ పాప్ కార్న్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.పావు కిలో బోన్లెస్ చికెన్,( Boneless Chicken ) ఒక కోడి గుడ్డు, చిల్లీ ఫ్లేక్స్ ఒక టీ స్పూన్, మిరియాల పొడి అర టీ స్పూన్, తగినంత ఉప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత, సొయా సాస్ అర టేబుల్ స్పూన్, కార్న్ ఫ్లోర్ రెండు టేబుల్స్, మైదాపిండి 50 గ్రాములు, బ్రెడ్ క్రంబ్స్ 50 గ్రాములు ఉంటే సరిపోతుంది.

Apart From Corns, You Can Also Make Popcorn With Chicken ,corns, Popcorn, Chicke
Advertisement
Apart From Corns, You Can Also Make Popcorn With Chicken ,corns, Popcorn, Chicke

చికెన్ పాప్ కార్న్ తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక గిన్నెలో చికెన్ తీసుకుని అందులో ఉప్పు, మిరియాల పొడి, సోయాసాస్, చిల్లీ ఫ్లెక్స్ బాగా కలపాలి.ఆ తర్వాత చికెన్ పావు గంట పాటు కదిలించకుండా అలాగే ఉంచాలి.

ఇప్పుడు మరో ప్లేట్లో మైదాపిండి, బ్రెడ్ క్రంబ్స్ వేసి కలపాలి.ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న తరువాత చికెన్ మైదాపిండి మిశ్రమంలో వేసి చికెన్ ముక్కలను బాగా పట్టేలా కోట్ చేసుకుని ప్లేట్లో తీసుకోవాలి.

ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.నూనె వేడి అయ్యాక ముందు సిద్ధం చేసుకున్న చికెన్ ముక్కలను వేసి వేయించాలి.

ఆ ముక్కలను కరకరలాడుతూ ఎర్రగా అయ్యేవరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చికెన్ పాప్ కార్న్ తయారైపోతుంది.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు