ఏపీలో రాజకీయ పార్టీల మధ్య నెలకొన్న ఎలక్షన్ వార్ ముదిరిపాకాన పడుతోంది.ఒక పార్టీని మించి మరో పార్టీ ఎన్నికల వాగ్దానాలు ఇస్తూ ఎన్నికల్లో గెలుపొందాలని చూస్తున్నాయి.
అయితే ఏపీ అధికార పార్టీ టీడీపీ తమ ప్రత్యర్థి పార్టీ వైసీపీ ఇచ్చిన ఎన్నికల వాగ్ధానాలను కూడా కాపీ కొట్టి అమలుచేయడం మొదలుపెట్టింది.టీడీపీ సంక్షేమ పథకాల దాటికి వైసీపీ విలవిలలాడిపోయింది.
ఇక మొత్తం టీడీపీ హవా మొదలయింది.వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరు అని అంతా అనుకుంటుండగానే కొన్ని రాజకీయ సమీకరణాలు వైసీపీకి అనూహ్యంగా కలిసొచ్చాయి.
టీడీపీతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీకి మధ్య రాజకీయ వైరం ఉండడంతో వారు జగన్ కు సహకరించడం మొదలుపెట్టారు.దీంతో టీడీపీ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిపోయింది.
టీడీపీ ప్రత్యర్థి పార్టీల ఎదురుదాడి మూకుమ్మడిగా మొదలవ్వడంతో ఎదుర్కోలేక తంటాలుపడుతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఇప్పుడు చర్చ అంతా టీడీపీ మీద వస్తున్న ఆరోపణలు, టీఆర్ఎస్ పార్టీ టీడీపీ మీద చేస్తున్న ఎదురు దాడి మాత్రమే చర్చకు వస్తోంది తప్ప టీడీపీ ఈ మధ్యకాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి ఎవారూ చర్చించడంలేదు.
ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్న రాజకీయంగా కనిపిస్తోందనే చర్చలు మొదలయ్యాయి.ఏపీ రాజకీయాల్లో పెద్ద చర్చగా మారిన డేటా చోరీ అంశం బాగా పాపులర్ అయ్యింది.
ఇందులో ప్రధానంగా ఓట్లను గల్లంతు చేసి విజయం సాధించాలనుకోవడం.ఇక కర్నూలు లాంటి జిల్లా మంత్రి ఫరూక్‌తో పాటు.
కుటుంబసభ్యుల ఓట్లూ గల్లంతయ్యాయి.అలాగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్యెల్యే ఓటు కూడా ఈ విధంగానే పోయింది.
దీంతో ఎవరి ఓట్లు చేర్చుతున్నారు ఎవరి ఓట్లు తీసివేస్తున్నారు అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది.

ఓట్ల తొలగింపు వ్యవహారం లో వైసీపీ మీద ఆరోపణలు వస్తుండగానే తెలంగాణలో ఐటీ గ్రిడ్ అనే సంస్థపై పోలీసుల దాడులు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.ఇద్దరు వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని కేసు కూడా నమోదు చేసి టీడీపీని ఇరుకునపెట్టే చర్యలు మొదలుపెట్టారు.తెలంగాణ పోలీసులు ఏపీ ప్రజల డేటా పేరుతో నేరుగా ఆరోపణలు చేయడంతోనే మొత్తం ఈ వ్యవహారం రచ్చ అయ్యింది.
డేటా చోరీ అయ్యే చాన్సే లేదని ఏపీ అధికారులు వాదించినా ప్రజల్లో మాత్రం ఏదో జరుగుతుంది అనే అనుమానం మొదలయ్యింది.ఇక ఆ తరువాత సేవామిత్ర యాప్‌లో ప్రజల వ్యక్తిగత సమాచారం ఉందన్నారు.
ఈ వివాదంలో ఇప్పుడు.ఏపీ తరపున రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలు, తెలంగాణ తరపున ఓ ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలో దిగడంతో ప్రజల చూపంతా ఈ కేసుల మీదే ఉంది తప్ప మిగతా అంశాలను గురించి పట్టించుకునే పరిస్థితి కనిపించడంలేదు.