వాలంటీర్ల ద్వారా ఆనందయ్య మెడిసిన్ పంపిణీ..!!

జూన్ 7వ తారీకు నుండి రెండు తెలుగు రాష్ట్రాలలో ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.

మొదట జిల్లా కేంద్రాలకు పంపిణీ చేసి, ఆ తర్వాత మెల్ల మెల్లగా ప్రభుత్వం యొక్క సహకారంతో బందోబస్తుతో ప్రతి ఒక్కరికి మందు అందేలా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆనందయ్య తెలపడం జరిగింది.

ఈ క్రమంలో కరోనా బారిన పడిన కొంతమంది కృష్ణపట్నం కి భారీగా తరలి రావడం మాత్రమే కాక.అనేక ఇబ్బందులు పడుతూ ఉండటంతో .ఆనందయ్య ఎవరిని కృష్ణపట్నం రావద్దని తెలియజేశారు.దీంతో ప్రస్తుతం కృష్ణపట్నం లో మందు పంపిణీ జరగడం లేదు.

కరోనా రోగులు చాలా దూరం నుండి వచ్చామని బతిమాలుతున్న గాని ఎక్కడ మెడిసిన్ దొరకటం లేదు.ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు లో వాలంటీర్ల ద్వారా ఆనందయ్య మందు పంపిణీ జరుగుతోంది.

పొదలకూరు మండలం లో 30 పంచాయతీలు ఉన్న నేపథ్యంలో రూట్ ఆఫీసర్ ల ద్వారా ఈ మెడిసిన్ ప్రతి ఇంటికి చేరేలా పటిష్ట బందోబస్తు తో ఆనందయ్య టీం తో పాటు ప్రభుత్వం పని చేస్తోంది.పరిస్థితి ఇలా ఉండగా ప్రస్తుతం కృష్ణపట్నం రావాలంటే కచ్చితంగా ఆధార్ కార్డు ఉంటేనే తప్ప ఎవరినీ పోలీసులు అనుమతించటం లేదు.

Advertisement
తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

తాజా వార్తలు