శ్రీవారిని దర్శించుకున్న ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ...

శ్రీవారిని ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ దర్శించుకున్నారు ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు అనంతరం ఆలయ వెలుపల వచ్చిన అవంతి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.

స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.

స్వామి వారిని ఎన్ని సార్లు దర్శించుకున్న ఒక ప్రత్యేకమైన అనుభూతి ఆశీస్సులు కలుగుతాయన్నారుకరోనా నిబంధనలు పాటిస్తూ మరోవైపు టీటీడీ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సంతోషదాయకం అన్నారు.పరిమిత సంఖ్యలోనే భక్తులను స్వామివారి దర్శనానికి టీటీడీ అనుమతిస్తున్నారు.

AP Tourism Minister Avanti Srinivas Visited Srivastava , Ap , Tourism Minister

బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11 వ తారీకున రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ సీఎం గరుడ సేవ రోజు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.గత రెండు సంవత్సరాలుగా యావత్తు మానవాళికి కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతోందని, థర్డ్ వేవ్ రాకుండా ప్రజలను రక్షించాలని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యాలకు ఆటంకాలు కలగకుండా స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

బియ్యం పిండిని ఇలా వాడితే బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా మిలమిల మెరుస్తారు
Advertisement

తాజా వార్తలు