నారా లోకేష్ పెద్ద మనసు.. మరో గల్ఫ్ బాధితుడికి బాసట

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన నారా లోకేష్( Nara Lokesh ).

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే.

రెండోసారి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక తన మార్క్ చూపిస్తున్నారు.ప్రభుత్వ పాలనపై ఇప్పటికే అనుభవం ఉండటంతో ఆయన దూసుకెళ్తున్నారు.

ఇదిలాఉండగా.గల్ఫ్ బాధితుల కష్టాలకు నారా లోకేష్ చలించిపోతున్నారు.

ఇటీవల కువైట్‌లో( Kuwait ) నరకయాతన అనుభవిస్తున్న అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ అనే వ్యక్తి అక్కడి బాధలను చెబుతూ తనను కాపాడాలని వీడియో సందేశాన్ని పంపాడు.ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి దృష్టికి వచ్చింది.

Advertisement

దీనిపై స్పందించిన లోకేష్.శివను క్షేమంగా స్వగ్రామానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేయాలని అధికారులు, ఎన్ఆర్ఐ టీడీపీ విభాగాన్ని ఆదేశించారు.

లోకేష్ ఆదేశాల మేరకు ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులు శివ( NRI TDP representatives ,Siva ) కోసం తీవ్రంగా గాలించారు.అయితే సదరు వీడియోలో ఎడారి ప్రదేశం తప్పించి తాను ఎక్కడున్నది మాత్రం వెల్లడించలేదు.దీంతో అతని ఆచూకీ కనుగొనడం కష్టమైంది.

అయినప్పటికీ రెండు రోజుల పాటు కువైట్‌లో గాలించి ఎట్టకేలకు శివ ఆచూకీని కనుగొన్నారు.అక్కడి నుంచి భారతదేశానికి వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలో కువైట్ నుంచి తన స్వగ్రామం చింతపర్తికి ( Chintaparthi )చేరుకున్నాడు శివ.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.లోకేష్ చొరవతో తాను బతికి బయటపడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు.

యముడు బ్రేక్ లో ఉన్నాడు కాబోలు.. రెప్పపాటులో పిల్లాడి ప్రాణం..
రెండేళ్లుగా క్రూయిజ్‌ షిప్స్‌లోనే తిరుగుతున్న యూకే మహిళ.. ఎందుకంటే..??

తాను స్వగ్రామానికి రావడానికి లోకేష్ చేసిన కృషి మరవలేనిదని.తమ కుటుంబం జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటుందని శివ కన్నీటి పర్యంతమయ్యారు.

Advertisement

తాజాగా మరో గల్ఫ్ బాధితుడికి లోకేష్ బాసటగా నిలిచారు.కోనసీమ జిల్లాలోని ఇసుకపూడికి చెందిన వీరేంద్ర కుమార్( Virendra Kumar ) నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి ఎడారిలో దుర్భర జీవితాన్ని గడుపుతున్నాడు.ఖతర్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించి.

తనను సౌదీ అరేబియాలోని ఓ ఎడారిలో ఒంటెల మధ్య పడేశారని , ఇక్కడ తాను జీవించలేకపోతున్నానని వీరేంద్ర ఓ వీడియో సందేశాన్ని పంపాడు.దీనిపై స్పందించిన నారా లోకేష్ అతనిని క్షేమంగా భారతదేశానికి తీసుకురావాల్సిందిగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగాన్ని ఆదేశించారు.

మంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్.అతని ఆచూకీని కనుగొని శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చారు.అక్కడ వీరేంద్ర కుమార్‌కు కుటుంబ సభ్యులు, స్నేహితులు స్వాగతం పలికారు.

తాజా వార్తలు