టీడీపీ నేతలకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు

ఏపీలోని పలువురు టీడీపీ నేతలకు రాష్ట్ర హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ఈ మేరకు పుంగనూరు, అంగళ్లు కేసుల్లో ఉన్న సుమారు 79 మంది టీడీపీ నేతలకు బెయిల్ ఇచ్చింది.

ఈ ఘటనల్లో అరెస్ట్ అయిన 79 మంది టీడీపీ నేతలు చిత్తూరు, మదనపల్లి, కడప జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.వీరందరికీ బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనం ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఇదే కేసులో మరో 30 మంది ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలో వీరందరిని తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఫెయిల్ అయిన సర్కస్ స్టంట్.. భయంకర బైక్ యాక్సిడెంట్ వైరల్..?
Advertisement

తాజా వార్తలు