ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్యతో ప్రస్తుతం భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్న సంగతి తెలిసిందే.నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం వుండొచ్చన్న కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో( Canadian Prime Minister Justin Trudeau ) వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఇరు దేశాలు ఇప్పటికే దౌత్యవేత్తలను బహిష్కరించాయి.అయితే దీని ప్రభావం విద్యా, వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపదని నిపుణులు భావిస్తున్నారు.
అంతర్జాతీయ సమాజం కూడా జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది.భారత్, కెనడా.
రెండు దేశాలు తమకు కావాల్సినవి కావడంతో ఏ దేశం కూడా తొందరపడటం లేదు.అమెరికా మాత్రం కెనడా దర్యాప్తుకు భారత్ సహకరించాలని సూచించింది.
ఇదిలావుండగా.కెనడాకు గట్టి బదులివ్వాలని భారత అధినాయకత్వం భావిస్తోంది.దౌత్యవేత్తను బహిష్కరించడం ఒక్కటి సరిపోదని, అంతకుమించి చర్యలు వుండాలని భావిస్తోంది.దీనిలో భాగంగా భారత్‌కు( India ) కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్రం తాత్కాలికంగా నిలిపివేసింది.
నిర్వహణ కారణాలతో వీసా సర్వీసులను తాత్కాలికంగా సస్పెండ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నా .అసలు కారణం మాత్రం వేరొకటని నిపుణులు చెబుతున్నారు.తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని భారత ప్రభుత్వం పేర్కొంది.ఈ వార్తలపై కేంద్ర విదేశాంగ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.
మరోవైపు.ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ అప్రమత్తమైంది.కెనడాలో ఇప్పటికే వున్న, ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్న భారతీయులకు( Indians ) కీలక హెచ్చరికలు జారీ చేసింది.కెనడాలో వున్నవారు, ముఖ్యంగా భారతీయ విద్యార్ధులు అత్యంత అప్రమత్తంగా వుండాలని బుధవారం ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది.
కెనడా ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన రివైజ్డ్ ట్రావెల్ అడ్వైజరీకి ప్రతీకారంగా ఇండియా ఈ అలర్ట్ జారీ చేసినట్లుగా నిపుణులు చెబుతున్నారు.
భారత దౌత్యవేత్తలు( Indian diplomats ), భారత వ్యతిరేక ఎజెండాను వ్యతిరేకించే వారిని కొన్ని గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయని అలర్ట్‌లో కేంద్రం చెప్పింది.అందుచేత ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రాంతాలకు, వేదికలకు దూరంగా వుండాలని విదేశాంగ శాఖ హెచ్చరించింది.కెనడాలోని భారతీయ సమాజం భద్రత, శ్రేయస్సు కోసం మన హైకమీషన్.
కెనడియన్ అధికారులతో నిరంతరాయంగా చర్చలు జరుపుతుందని తెలిపింది.కెనడాలో క్షీణిస్తున్న పరిస్ధితుల దృష్ట్యా.
భారతీయ విద్యార్ధులు అప్రమత్తంగా వుండాలని విదేశాంగ శాఖ బుధవారం పేర్కొంది.కెనడాలోని భారతీయ పౌరులు , విద్యార్ధులు ఒట్టావాలోని భారత హైకమీషన్.
టోరంటో, వాంకోవర్‌లలోని భారత కాన్సులేట్ కార్యాలయాలు.సంబంధిత వెబ్‌సైట్లు, MADAD పోర్టల్ madad.gov.in ద్వారా నమోదు చేసుకోవాలని కోరింది.