ఆస్తుల పంపిణీపై ఏపీ ప్రభుత్వం పిటిషన్ విచారణ వాయిదా

తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఆస్తుల పంపిణీపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.

ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీం ధర్మాసనం ఆరు వారాలకు వాయిదా వేసింది.

అటు తెలంగాణ, కేంద్ర ప్రభుత్వ న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడంతో ఇరువురికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.అదేవిధంగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలిచ్చింది.

తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ కి రిజాయిండర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్ కి సూచించింది.కాగా ఆస్తుల విభజన సరిగా జరగకపోవడంతో ఆర్థికంగా నష్టపోయామని ఏపీ పిటిషన్ లో పేర్కొన్న విషయం తెలిసిందే.

గుంటూరు జీజీహెచ్ లో పెట్ స్కాన్' సిద్ధం
Advertisement

తాజా వార్తలు