అంగన్‎వాడీ కార్యకర్తలపై ఎస్మా ప్రయోగించిన ఏపీ ప్రభుత్వం..!

ఏపీలో అంగన్‎వాడీ కార్యకర్తలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా( ESMA ) ప్రయోగించింది.

ఈ మేరకు అంగన్‎వాడీ కార్యకర్తలు( Anganwadi Workers ) చేస్తున్న సమ్మెను నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

అయితే తమ న్యాయపరమైన కోర్కెలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‎వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రభుత్వం ఆరు నెలలపాటు అంగన్వాడీల సమ్మెపై నిషేధాన్ని విధించింది.అత్యవసర సర్వీసులు కింద సమ్మె నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.ఈ నేపథ్యంలోనే అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తే చర్యలు తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం( AP Government ) హెచ్చరించింది.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు