ఆరోగ్య శ్రీ పరిధిలోకి మరో వ్యాధిని చేర్చిన ఏపీ ప్రభుత్వం.. !

పేదల విషయంలో ఏపీ ప్రభుత్వం ఆలోచనలు ఒక్కడుగు ముందే ఉన్నాయట.

ముఖ్యంగా కరోనా సమయంలో ఈ వైరస్ బారిన పడ్డ పేదలకు అందించే వైద్యం విషయంలో ఏపీ ముఖ్య మంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకుని కార్పోరెట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపధ్యంలోనే ఆరోగ్య శ్రీ పరిధిలోకి మిస్-సి వ్యాధిని చేర్చుతున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది.ఇకపోతే ఎక్కువగా పిల్లలలో కనిపించే ఈ మిస్-సి వ్యాధికి కరోనా వైరస్‌ తో సంబంధం ఉన్నదట.కాగా ఈ చికిత్స ఖర్చును వ్యాధి తీవ్రత ఆధారంగా ఖరారు చేసిన ప్రభుత్వం వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే రూ.77,533లతో పాటుగా వెంటిలేటర్ అవసరం ఉంటే మరో రూ.25 వేలు అదనంగా అందించాలని నిర్ణయించిందట.రూ.62,533లను తక్కువ స్థాయి చికిత్స కోసం అందిస్తుండగా, మోడెరేట్ లెవెల్ చికిత్స కోసం రూ.42,533, మైల్డ్ లెవెల్ చికిత్స కోసం రూ.42,183 లను అందిస్తూనే చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్ల ఖరీదును కూడా ఆరోగ్య శ్రీ లో చేర్చిందట.

Ap Government Added Another Disease In Aarogya Sri, AP Govt, Added, Another Dis
న్యూస్ రౌండప్ టాప్ 20

తాజా వార్తలు