రెండు లక్షల మంది మృగాలకు జియో ట్యాగింగ్..

మహిళలు యువతులు చిన్నారులు పై అకృత్యాలకు పాల్పడే మానవ మృగాలను కఠినంగా శిక్షించేందుకు ప్రభుత్వం చట్టాలను పదును పెడుతుంది.

ఈ మాదిరి నేరాలకు పాల్పడే నిందితులకు సత్వరం శిక్షలు పడేలా గట్టి కసరత్తు చేస్తుంది.అంతేకాదు బాధితులకు సత్వర న్యాయం  అందించాలనేది ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది.దిశ పథకం చట్టం రూపం దాలిస్తే మృగాళ్లకు శిక్షలు త్వరగాపడే అవకాశాలు ఉన్నాయి.

దిశ పథకంతో దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు.ఆయా పోలీస్ స్టేషన్ లో ప్రత్యేక అధికారులు, సిబ్బందిని ఇప్పటికే నియమించరు.

లైంగిక వేధింపులకు  పాల్పడేవారు, అత్యాచార ప్రయత్నం చేసేవారు వేధింపులకు పాల్పడిన వారికి పోలీసులు గుర్తిస్తున్నారు.పోలీస్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఏపీలో ఈ మాదిరిగానే నేరాలకు పాల్పడుతున్న లైంగిక నేరగాళ్ల సంఖ్య 2లక్షలుగా ఉంది.

ఈ 2లక్షల మంది ఇటీవల కాలంలో జియో ట్యాగింగ్ చేశారు.సోషల్ మీడియా ద్వారా యువతులను వేధించే వారిపై పోలీసులు సైబర్ బుల్లీ షీట్లు తెరుస్తున్నారు.

Ap Government Disha Scheme To Zeo Tag Over Two Lakh Members Who Did Rape Attempt

మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై పోక్సో చట్టాన్ని ప్రయోగిస్తున్నారు.గతంలో ఎవరైనా నిందితులప కేసులు నమోదైతే 3 నుంచి 4 మాసాల్లో చార్జిషీట్ దాఖలు అయ్యేవి.

ఇలా చార్జిషీట్లు దాఖలైన సందర్భాల్లో సాంకేతిక సమస్యలను పరిగణలోకి తీసుకొని నిందితులకు బెయిల్ లభించేది.ఇప్పుడు ఆ పరిస్థితుల్లో సమూలంగా మార్పులు వచ్చాయి.2019లో ఛార్జీషీటును తగ్గించారు.

Ap Government Disha Scheme To Zeo Tag Over Two Lakh Members Who Did Rape Attempt

2020లో ఈ వ్యావధిని 86 రోజులకు, ఈ ఏడాది 42 రోజులకు కుదించారు.తాజాగా ఛార్జీషీటు వ్యావధని 15 రోజుల నుంచి ఏడు రోజులకు కుదించారు.15 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేసిన కేసులు 2115 ఉన్నాయి.1645 కేసులకు వారం రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేశారు.ఏడు రోజుల్లో చార్జిషీట్ దాఖలైన కేసులో 60 హత్యచార కేసులు ఉన్నాయి.

అత్యాచారయత్నం కేసులో 92 కాగా ఫోక్సో కేసులు 130 ఉన్నాయి.లైంగిక వేధింపులకు సంబంధించి 718 కేసుల్లో వారం రోజుల్లోనే పోలీస్ చార్జిషీట్లు దాఖలు చేశారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

గత ఏడాది ఇదే మాదిరి నేరాలకు గాను నిందితులకు న్యాయస్థానాలు కఠిన శిక్షలు విధిస్తూ తీర్పు చెప్పాయి.గత ఏడాది ముగ్గురికి మరణ శిక్ష విధించాయి.17 మందికి యావజ్జీవ ఖైదు విధించారు.  మరో ముగ్గురికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షలు విధించాయి.

తాజా వార్తలు