ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక వ్యాఖ్యలు

సమైక్యం కోసం నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

తెలంగాణలో పార్టీకి ఇబ్బంది అని తెలిసి కూడా సమైక్యానికి కట్టుబడ్డామని చెప్పారు.

రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు గడిచిందన్నారు.విభజన జరిగిన తీరు సరిగా లేదని, మళ్లీ చర్చించుకోవాలని కోర్టు చెబితే తాము ముందుంటామని మాత్రమే చెప్పినట్లు వెల్లడించారు.

ఈ వ్యవహారాన్ని రాజకీయంగా పెద్దది చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.వాలంటీర్ల వ్యవస్థతో నేరుగా లబ్ధిదారుల ఇంటికే సంక్షేమం వచ్చేలా చేస్తున్నామని తెలిపారు.

వాలంటీర్లు ఉద్యోగులు కాదు సేవకులని జగన్ గతంలో చెప్పారని గుర్తు చేశారు.వాలంటీర్లపై తప్పుడు ప్రచారం సరికాదని పేర్కొన్నారు.

Advertisement
ఏంది భయ్యో.. నీకంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా.. అంత క్యాజువల్ గా నడుస్తున్నావ్?

తాజా వార్తలు