జగన్‌కు షాక్‌ ఇచ్చే ఫొటో ఇది..

కింద ఉన్న ఫొటో చూడండి.ఏదో పెద్ద ఉద్యమమే నడుస్తున్నట్లు ఉంది కదూ.

ఏపీలో ఉద్యోగులు పడుతున్న మనోవేదనకు ఈ ఫొటోనే సాక్ష్యం.అధికారంలోకి రావడానికి జగన్మోహన్‌రెడ్డి ఎన్నో హామీలు గుప్పించారు.

తీరా వచ్చిన తర్వాత వాటిలో చాలా వరకూ అమలు చేయలేకపోతున్నారు.ఇప్పటి వరకూ గత ప్రభుత్వ పనులను రివర్స్‌ చేసే పనిలోనే ఉన్న జగన్‌.

తన హామీల సంగతిని పక్కన పెట్టారు.

Ap Employees Grieve Rally
Advertisement
Ap Employees Grieve Rally-జగన్‌కు షాక్‌ ఇచ్చే

జగన్‌ కీలక హామీల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేస్తానన్నది కూడా ఒకటి.అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే ఈ పని చేస్తానని జగన్‌ తన పాదయాత్రతోపాటు ఎన్నికల సభల్లో పదేపదే చెప్పారు.కానీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా దీనిపై ఎటూ తేల్చలేదు.

దీంతో విజయనగరంలో ఇలా ఉద్యోగులు మనోవేదన ర్యాలీ పేరుతో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.ఉత్తరాంధ్రతోపాటు ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేల మంది ఉద్యోగులు ఈ మనోవేదన ర్యాలీకి వచ్చి తమ బాధలను చెప్పుకునే ప్రయత్నం చేశారు.

వారం రోజుల్లో చేస్తానన్న సీపీఎస్‌ రద్దును ఆరు నెలలైనా ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.విజయనగరంలోని జడ్పీ కార్యాలయం దగ్గర ప్రారంభమైన ఈ ర్యాలీ.

రైల్వేస్టేషన్‌, గంటస్తంభం, కోట మీదుగా గురజాడ కళాక్షేత్రం వరకూ సాగింది.ర్యాలీ తర్వాత సభ కూడా నిర్వహించారు.

ఇచ్చిన మాట మేరకు వెంటనే 653, 654, 655 జీవోలను రద్దు చేయాలని సభకు హాజరైన రాష్ట్రస్థాయి ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు.మొదటి కేబినెట్‌ సమావేశంలోనే జగన్‌ సీపీఎస్‌ రద్దుపై చర్చించినా.

Advertisement

ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

తాజా వార్తలు