Superstar Krishna CM Jagan : కృష్ణ మరణానికి సంతాపం వ్యక్తం చేసిన ఏపీ సీఎం వైఎస్ జగన్..!!

సూపర్ స్టార్ కృష్ణ మరణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు.సినీ పెద్దలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఒకే ఏడాదిలో ముగ్గురు మరణించడంతో ఘట్టమనేని ఫ్యామిలీ కన్నీరు మున్నీరు అవుతున్నారు.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృష్ణ మృతికి సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేశారు.

"కృష్ణ గారు తెలుగువారి సూపర్ స్టార్.ఆయనే అల్లూరి.

ఆయనే మన జేమ్స్ బాండ్.నిజ జీవితంలో కూడా మనసున్న మనిషిగా, సినీరంగంలో తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకున్న ఆయన మరణం తెలుగు సినీ రంగానికి, తెలుగు వారికి తీరని లోటు.

Advertisement

మహేష్ కు, కృష్ణగారి కుటుంబ సభ్యులందరికీ ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను." అని పోస్ట్ పెట్టడం జరిగింది.

రాజకీయపరంగా కృష్ణ ఎప్పుడు కూడా వైయస్ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తూ ఉండేవారు.ఈ క్రమంలో కృష్ణ మరణించడంతో వైసీపీ పార్టీ నాయకులు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement