నంద్యాల జిల్లాకు ఏపీ సీఎం జగన్..

ఏపీ సీఎం జగన్ ఇవాళ నంద్యాల జిల్లాకు వెళ్లనున్నారు.ఈ క్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి పార్థివదేహానికి ఆయన నివాళులు అర్పించనున్నారు.

అనంతరం ధర్మారెడ్డి కుటుంబాన్ని మంత్రులతో కలిసి సీఎం జగన్ పరామర్శించనున్నారు.అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ చంద్రమౌళి రెడ్డి మృతిచెందిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్వగ్రామం పారుమంచాలలో నిర్వహించనున్న చంద్రమౌళి రెడ్డి అంత్యక్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement