రాజకీయాల కోసం రావణకాష్టంగా ఏపీ..!

ఏపీలో ఓ వైపు అమరావతే రాజధాని అని, మరోవైపు మూడు రాజధానులంటూ రాజకీయాలు వేడెక్కాయి.అధికార, విపక్ష పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారుస్తున్నారని విమర్శించారు.ఉత్తరాంధ్రకు ఏం చేశారో టీడీపీ, వైసీపీలు శ్వేతపత్రం ఇవ్వాలని అన్నారు.

రాయలసీమ, ఉత్తరాంధ్రలు వెనుకబడటానికి ఆ రెండు పార్టీలే కారణమని ఆరోపించారు.సీపీఐ పార్టీ నేతలు కూడా ఆత్మ పరిశీలన చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.

పేదల పార్టీ అని చెప్పుకునే సీపీఐ బీసీలకు ఎందుకు పార్టీ పగ్గాలు అప్పగించలేదని ప్రశ్నించారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు