నిన్న జగన్‌ రిబ్బన్‌ కట్‌ చేశారు.. ఇప్పుడేమో ఇలా!

ఇది నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన దిమ్మదిరిగే షాక్‌.ఆంధ్రప్రదేశ్‌లో గెలవగానే ప్రగతి భవన్‌కు వెళ్లి ఆలింగానాలు చేసుకున్నారు.

తర్వాత కృష్ణా, గోదావరి నదులను కలిపేద్దాం అంటూ మరోసారి చర్చల కోసం వెళ్లారు.కేసీఆర్‌ వచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవానికి పిలిస్తే వెళ్లారు.

కానీ ఇప్పుడదే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఏపీ ప్రయోజనాలకు విరుద్ధమైనదని సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తుండటం గమనార్హం.

Ap Appeals In An Affidavit To The Court Not To Give Kaleshwar A National Status

అసలు కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వొద్దని కోర్టుకు సబ్‌మిట్‌ చేసిన అఫిడవిట్‌లో ఏపీ కోరింది.ఏపీ రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా, విచక్షణా రహితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కడుతున్నారని విమర్శించడం విశేషం.విభజన హామీల అమలులో జాప్యం జరుగుతోందంటూ తెలంగాణ బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీం వేసిన పిటిషన్‌కు గతంలోనే తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది.

Advertisement
Ap Appeals In An Affidavit To The Court Not To Give Kaleshwar A National Status

ఇప్పుడు ఏపీ దానికి కౌంటర్‌ వేసింది.

Ap Appeals In An Affidavit To The Court Not To Give Kaleshwar A National Status

పోలవరం వల్ల ముంపుకు గురయ్యే మండలాలను ఏపీలో కలిపేసినందు వల్ల ఇక ఈ ప్రాజెక్ట్‌ విషయంలో తెలంగాణకు ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని ఏపీ వాదించింది.ఈ కేసులో తెలంగాణను ఓ పార్టీగా పరిగణించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది.ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వల్ల ఏపీలో పోలవరం, ధవళేశ్వరం ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని తన అఫిడవిట్‌లో ఏపీ స్పష్టం చేసింది.

కాళేశ్వరం రీడిజైన్‌ చేసిన ప్రాజెక్ట్‌గా తెలంగాణ చెబుతున్నా.అది కచ్చితంగా కొత్త ప్రాజెక్టేనని ఏపీ వాదిస్తుండటం గమనార్హం.

అపెక్స్‌ కౌన్సిల్‌ ముందు ఈ విషయాలను పెట్టాలని ఇప్పటికే కేంద్రాన్ని ఎన్నోసార్లు కోరామని కూడా ఏపీ చెబుతోంది.అయినా ఏపీ ప్రాజెక్టుల పరిధిలోని రైతులను విస్మరించి ఈ పనులను తెలంగాణ కొనసాగిస్తోందని, ఈ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించే ఆలోచనలను కేంద్రం విరమించుకోవాలనీ కోరడం విశేషం.మొత్తానికి కేసీఆర్‌తో దూరం పెంచుకోవడానికి జగన్‌ ప్రయత్నిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సుప్రీంకోర్టులో ఏపీ వాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

Advertisement

తాజా వార్తలు