న్యూస్ రౌండప్ టాప్ 20

1.జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద

ఉమ్మడి మహబూబ్ నగర్ లోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది.

ఎగువ కర్ణాటకలోని నారాయణపూర్ డ్యామ్ నుంచి 1,31 తీసుకుని నీరు జూరాల కు వచ్చి చేరుతోంది.దీంతో జూరాల ప్రాజెక్టు నుంచి 31 గేట్లను అధికారులు ఎత్తివేశారు.

2.హరీష్ రావు విమర్శలు

కిషన్ రెడ్డి గురువు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అని తెలంగాణ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.

3.మణిపూర్ కు బయలుదేరిన విపక్ష పార్టీల ఎంపీలు

విపక్ష పార్టీల ఎంపీలు మణిపూర్ కు బయలుదేరి వెళ్లారు.21 మంది ఎంపీలు మణిపూర్ లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు.

4.బండి సంజయ్ కు కీలక పదవి

కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కు కీలక బాధ్యతలను హై కమాండ్ అప్పగించింది.సంజయ్ కు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది.బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు బాధ్యతలు అప్పగించింది.

5.ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి

ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది.దీంతో 70 గేట్లు నీటిని దిగువకు విడుదల చేశారు.

6.గోదావరికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ

Advertisement

భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో గోదావరి ప్రవహిస్తుంది.దీంతో మూడో ప్రమాద హెచ్చరిక అధికారులు జారీ చేశారు.

7.కడెం ప్రాజెక్టును సందర్శించిన అధికారులు

కడెం ప్రాజెక్టును సెంట్రల్ స్టేట్ బ్యాంక్ సేఫ్టీ టీమ్స్ సందర్శించాయి.

8.కిషన్ రెడ్డి పై జిట్ట బాలకృష్ణ రెడ్డి విమర్శలు

కేంద్ర మంత్రి తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై తెలంగాణ ఉద్యమకారుడు జట్టా బాలకృష్ణారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.కిషన్ రెడ్డిని సమైక్యవాదిగా జిట్టా అభినందించారు.

9.కరీం నగర్ లో ఈటెల పర్యటన

కరీంనగర్ లో హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు.వర్షాలకు తెగిన రోడ్లు, బ్రిడ్జి కల్వర్ట్  లను ఆయన పరిశీలించారు.

10.పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరిక

వర్షాలు నేపథ్యంలో మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.మూసారంబాగ్, ఘాట్ బ్రిడ్జి వద్ద ప్రమాదకరంగా మూసి ప్రవహిస్తోంది.

11.నటి శోభన ఇంట్లో చోరీ

సినీనటి భరతనాట్య కళాకారుని శోభన ఇంట్లో చోరీ జరిగింది.ఆమె ఇంటి పనిమనిషి చోరీకి పాల్పడినట్లు పోలీసు విచారణ లో వెళ్లడయ్యింది.

12.మధుమలైకి రాష్ట్రపతి

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు ఐదు నీలగిరి జిల్లా మధుమలైలోని తెప్పకాడు ఏనుగుల శిబిరాన్ని సందర్శించనున్నారు.

13.తిరుమల సమాచారం

భక్తుల రద్దీ కొనసాగుతోంది.టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు పది కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు.

14.తెలంగాణ క్యాబినెట్ సమావేశం

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 23, శుక్రవారం 2024
పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?

రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈనెల 31న చేపట్టనున్నారు.సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశాన్ని సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించనున్నారు.

15.వరద బాధితులకు 15 వేలు ఇవ్వాలి

జిహెచ్ఎంసి పరిధిలో వరద ముంపునకు గురైన కుటుంబాలకు 15 వేల చొప్పున ఆర్థిక సహాయం చేయాలని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేసింది

16.హైకోర్టు సీజే గా జస్టిస్ ఠాకూర్ ప్రమాణం

Advertisement

ఏపీ హైకోర్టు నాలుగో ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణస్వీకారం చేశారు.

17.సీఎం కేసీఆర్ బహుజన ద్రోహి

ఎస్సీ వర్గీకరణ చేపట్టాలన్న డిమాండ్ తో వచ్చేనెల లో మాదిగల విశ్వరూప మహాసభ నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు.సీఎం కేసీఆర్ బహుజన ద్రోహి అని మందకృష్ణ మాదిగ విమర్శించారు.

18.కోర్టులో పెండింగ్ కేసులు

తెలంగాణ కోర్టులో 11.62 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయిని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేగ్ వాల్ వెల్లడించారు.

19.ఆగస్టు 1న ఏబీవీపీ కథనభేరి

విద్యారంగ విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆగస్టు 1 న కథన బేరిని నిర్వహిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ తెలిపారు.

20.హార్టికల్చర్ డైరెక్టర్ గా గంధం చంద్రుడు

ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.హార్టికల్చర్ డైరెక్టర్ గా ఐఏఎస్ గంధం చంద్రుడు ను నియమించారు.

తాజా వార్తలు