న్యూస్ రౌండప్ టాప్ 20 

1.టెట్ కు గ్రీన్ సిగ్నల్

ఏపీలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ( టెట్ ) కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

ఈమేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ జీవో నెంబర్ 23 విడుదల చేశారు.

2.ఏపీ ఎన్నికల కమిషనర్ కు నోటీసులు

Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold

ఏపీ స్పీకర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ఇవ్వనుంది.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇచ్చిన నోటీసు ను ప్రివిలేజ్ కమిటీ విచారణకు స్వీకరించింది.

3.తనపై కేసు కొట్టెయ్యలంటూ కోర్టుకి బాబు

అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయంటూ సి ఐ డి నోటీసులు ఇవ్వడంపై చంద్రబాబు కోర్టులో పిటిషన్ వేశారు తనపై కుట్ర పూరితంగా కేసులు నమోదు చేశారని వాటిని కొట్టివేయాలంటూ పిటిషన్ లో పేర్కొన్నారు.

4.కరోనా ఎఫెక్ట్ : పార్కులు, గార్డెన్ లు మూసివేత

Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం పెరిగిపోతుండడంతో గుజరాత్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించే దిశగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే గుజరాత్ లోని అనేక పట్టణాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించగా , ఇప్పుడు అహ్మదాబాద్ నగరపాలక సంస్థ మొత్తం నగర పరిధిలోని పార్కులు , గార్డెన్ లను మూసి వేస్తూ నిర్ణయం తీసుకుంది.

5.భారత్ లో కరోనా

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 28,903 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

6.ఇంటర్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్

Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లు , కాలేజీలు, మోడల్ స్కూళ్లు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లోనూ ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ పేర్కొన్నారు.

7.తెలంగాణలో కరోనా

గడచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 278 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

8.బ్రెయిలీ లిపి లో తెలంగాణ ఉద్యమ చరిత్ర

Ap And Telangana News Headlines, Breaking News, Top20 News, Roundup, Today Gold
Advertisement

తెలంగాణ ఉద్యమ చరిత్రను బ్రెయిలీ లిపిలో ముద్రించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ ఛైర్మన్ వాసుదేవరెడ్డి తెలిపారు.

9.దిల్ షుక్ నగర్ లో ఉద్యోగ మేళా

దిల్ షుక్ నగర్ లోని నోబుల్ డిగ్రీ, పీజీ కళాశాలల్లో ఈ నెల 20 వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు.

10.గుంటూరు నగర మేయర్ గా మనోహర్ నాయుడు

గుంటూరు నగర మేయర్ గా మనోహర్ నాయుడు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు బాధ్యతలు స్వీకరించారు.

11.పార్టీ సీనియర్ నేతలతో బాబు భేటీ

పార్టీ సీనియర్ నేతలతో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నేడు కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

12 .చెరువుల కబ్జాలపై పిటిషన్ .హైకోర్ట్ లో విచారణ

చెరువుల కబ్జాలపై తెలంగాణ హై కోర్ట్ లో నేడు విచారణ జరిగింది.ఎఫ్టిఎల్ లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నట్టుగా పిటిషనర్ హై కోర్ట్ కు తెలిపాడు.దీనిపై ఎఫ్టీ ఎల్ లో నిర్మాణాలు జరపవద్దంటూ న్యాయవాది శరత్ కుమార్ కోరారు.

13.అసెంబ్లీ లో పాట పాడిన మంత్రి హరీష్ రావు

తెలంగాణ అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా తెలంగాణ మంత్రి హరీష్ రావు పాట పాడారు. చూడు చూడు నల్గొండ గుండె మీద ఫ్లోరైడ్ బండ బొక్కలోంకరబోయిన బతుకుల మన నల్గొండ దుక్కమెల్లదేసేదెన్నాళ్ళు అంటూ హరీష్ పాటు పాడారు.

14 కూలిన మిగ్ 21 యుద్ధ విమానం

మిగ్ 21 బైసన్ యుద్ధ విమాన ప్రమాదంలో వాయుసేన సీనియర్ అధికారి ఒకరు దుర్మరణం చెందారు.

15.సీజనల్ వ్యాధిగా కరోనా

కరోనా విజృంభణ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది.ఈ నేపథ్యంలో కరోనా సీజనల్ వ్యాధిగా మారుతోందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

16 .కరోనా వాక్సిన్

దానిమ్మ ర‌సంలో ఇవి క‌లిపి సేవిస్తే..ఆ జ‌బ్బులు మాయం!

ఇకపై 45 ఏళ్ళ వయస్సు దాటినా ప్రతి ఒక్కరికి కరోనా వాక్సిన్ వేయించుకోవాలని, ఈ మేరకు వాక్సిన్ అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్రం తెలిపింది.

17 తెలంగాణ బడ్జెట్

2 ,30 825 కోట్లతో 2021 -22 సంవత్సరానికి తెలంగాణ వార్షిక బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు.

18 .తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా జేసీ

Advertisement

తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ కౌన్సిలర్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.

19 .రామమందిరానికి 300 కేజీల తాళం

అయోధ్యలో భవ్య రామమందిరానికి ఉత్తరప్రదేశ్ లోని అలీఘడ్ కు చెందిన వృద్ధ దంపతులు 300 కేజీల బరువున్న తాళాన్ని తయారు చేశారు.దీనిని త్వరలోనే రామ మందిర ట్రస్ట్ కు అందించనున్నారు.

20 .ఈ రోజు బంగారం ధరలు

22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 44,280 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర - 45,280 .

తాజా వార్తలు