న్యూస్ రౌండప్ టాప్ 20

1.జగ్గారెడ్డి హాట్ కామెంట్స్

టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్ సమస్య తీవ్రంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు.

 

2.ధాన్యం కొనుగోలు పై మంత్రి హరీష్ రావు సమీక్ష

  యాసంగి ధాన్యం కొనుగోలు పై జిల్లా కలెక్టరేట్ లో మంత్రి హరీష్ రావు సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 

3.ఈ వారంలోనే పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

 

ఈ వారంలోనే పోలీసులు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలంగాణ మంత్రి హరీష్ రావు తెలిపారు. 

4.సింగరేణిలో ప్రభుత్వ జోక్యం ఎక్కువయ్యింది : ఈటెల

  సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఎక్కువైంది అని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. 

5.వారాంతాల్లో బ్రేక్ దర్శనాలు రద్దు : టీటీడీ

 

తిరుమలలో రద్దీ నేపద్యంలో అదనపు సిబ్బందిని నియమించామని టీటీడీ ఈవో ధర్మ రెడ్డి పేర్కొన్నారు.వారాంతాల్లో నాలుగు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. 

6.జగన్ పాలన పై తులసి రెడ్డి కామెంట్స్

  వైసీపీ పాలనలో రాష్ట్రం నేరాల ఏపీ గా మారడం శోచనీయమని కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి విమర్శించారు. 

7.హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వనిత

 

Advertisement

ఏపీ హోం మంత్రిగా తానేటి వనిత సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. 

8.త్వరలో ఏపీకి 16 మెడికల్ కాలేజీలు

  త్వరలో ఏపీకి 16 మెడికల్ కాలేజీలు రాబోతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. 

9.సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా నాగార్జున బాధ్యతలు స్వీకరణ

 

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా మెరుగు నాగార్జున బాధ్యతలు స్వీకరించారు. 

10.బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకున్న టీఆర్ఎస్

 తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం వేముల లో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు టిఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. 

11.రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో ఉద్యోగాల భర్తీ

 

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేస్తున్నారు.మొత్తం 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. 

12.టీఆర్ఎస్ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం

  హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీ లో టీఆర్ఎస్ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ హాజరయ్యారు. 

13.ఆవుల పెంపకానికి లైసెన్స్ ఉండాల్సిందే

 

ఆవుల పెంపకానికి లైసెన్స్ ఉండాల్సిందేనని రాజస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. 

14.యూరియా ఎరువులు సిద్ధం చేయాలి : మంత్రి

  రాష్ట్రానికి అవసరమైన యూరియా డిఎపి ఎరువులు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

15.ఆస్పత్రుల నర్వహణలో తెలంగాణకు మూడో స్థానం

 

ఎస్‌యూవీ కారుపైకి దూకిన కోతి.. అది చేసిన తుంటరి పనికి యజమాని షాక్!
పుష్ప 2 అనుకున్న రేంజ్ లో ఆడకపోతే ఎవరికి ఎక్కువ నష్టం వస్తుంది...

ఆసుపత్రుల నిర్వహణలో తెలంగాణ మూడో స్థానం లో ఉన్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. 

16.భారత్ లో కరోనా

  మెడిసిన్ 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,183 కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యాయి. 

17.బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో పోస్టుల భర్తీ

 

Advertisement

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది.మొత్తం 348 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

18.మైనారిటీ సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీ పై సమీక్ష

  మైనారిటీ సంక్షేమ శాఖలో పోస్టులను భర్తీ చేసే నిమిత్తం మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

19.ఈ కామర్స్ పై జాతీయ విధానాన్ని ప్రకటించాలి : కేటీఆర్

 

ఈ కామర్స్ పై జాతీయ విధానాన్ని ప్రకటించాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 

20.ఏపీ లో రైతులు వరి పంట వేయొద్దు : మంత్రి ధర్మాన

  ఏపీలో రైతులు వరి పంట వేయవద్దని , వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపారని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు. .

తాజా వార్తలు