టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి( Anushka Shetty ) గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది అనుష్క.
తెలుగులో ప్రభాస్,అల్లు అర్జున్, రానా, రామ్ చరణ్, మహేష్ బాబు, నాగార్జున, రవితేజ లాంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.అంతేకాకుండా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది అనుష్క.
ఇది ఇలా ఉంటే అనుష్క నుంచి ఎటువంటి సినిమాలు రాక ఇప్పటికీ దాదాపుగా రెండేళ్లు గడిచిపోయింది.

చివరిగా అనుష్క నిశ్శబ్దం( Nishabdham ) సినిమాలో నటించింది.ఆ తర్వాత అనుష్క సినిమాలకు సంబంధించి ఒక కమిట్మెంట్ కూడా లేదు.అయితే అంతకుముందు భాగమతి, సైరా నరసింహారెడ్డి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
బాహుబలి సినిమా తర్వాత అనుష్క మరే సినిమా చేయలేదు.అయితే గడిచిన కొన్ని ఏళ్లలో చూసుకుంటే ఈ విషయం క్లారిటీగా అర్థం అవుతుంది.
అనుష్క సినిమాలకు దూరంగా ఉండటంతో ఆమె త్వరలో పెళ్లికూతురు ఎక్కబోతోంది అంటూ వార్తలు వినిపించినప్పటికీ అవన్నీ ఒట్టి రూమర్స్ కానీ మిగిలిపోయాయి.

ఇది ఇలా ఉంటే అనుష్క సైజ్ జీరో సినిమా కోసం బరువు పెరిగే ఆ తర్వాత బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రయత్నాలు ఫలించలేదు.ఇప్పటికీ అనుష్క అలాగే బొద్దుగా ముద్దుగా ఉంది.ఇది ఇలా ఉంటే చాలా గ్యాప్ తర్వాత అనుష్క నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉంది.
ఇది ఇలా ఉంటే అనుష్క సోషల్ మీడియాలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది.ఎప్పుడో ఒకసారి పోస్టులు లేదంటే ఫొటోస్ మాత్రమే షేర్ చేస్తూ ఉంటుంది అనుష్క.

తాజాగా స్వీటీ తన ట్విట్టర్( Twitter ) ఖాతాలో ఒక ఫోటోని షేర్ చేయగా అది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ ఫోటోని చూసిన అనుష్క అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తూ ఆ ఫోటోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తుండగా కొంతమంది నెటిజన్స్ మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.అనుష్క షేర్ చేసిన ఆ ఫోటోలో వైట్ కలర్ డ్రెస్సులు ఎంచక్కా బుగ్గ కింద చేయి పెట్టుకొని ఎంతో ముద్దుగా కనిపిస్తూ నవ్వుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.ఆ ఫోటోని చూసినా కొంతమంది ట్రోలర్స్ చేస్తుండగా అభిమానులు బొద్దుగా ఉంటే మాత్రం ఏంటిరా దేవత దేవతనే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అనుష్క సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.







