జాతి రత్నాలు సినిమా తో ఒక్క సారిగా యూత్ ఆడియన్స్ దృష్టి ని ఆకర్షించిన దర్శకుడు అనుదీప్. మొదటి సినిమా తో సూపర్ హిట్ ను దక్కించుకున్న అనుదీప్ ప్రస్తుతం తమిళ హీరో శివ కార్తికేయన్ తో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే.
ఆ సినిమా కు ఇటీవలే ప్రిన్స్ అనే టైటిల్ ను ఖరారు చేసిన విషయం తెల్సిందే.తాజాగా సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసేందుకు ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది.
వీడియో లో సినిమా ను ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే విషయాన్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది.దీపావళికి సినిమా ను విడుదల చేసే విధంగా ప్లాన్ చేసినట్లుగా పేర్కొన్నారు.
శివ కార్తికేయన్ ను మొదటి సారి తెలుగు లో హీరోగా పరిచయం చేయబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈసినిమా పై ఉంది.తెలుగు లో మంచి గుర్తింపు ఉన్న నటుడు సత్యరాజ్ కు ఈ సినిమా లో కీలక పాత్ర ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఆయన కూడా సినిమా రిలీజ్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ వీడియో లో కనిపించాడు.
అనుదీప్ మరియు శివ కార్తికేయన్ కాంబోలో పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సినిమా ఉంటుందని యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.
జాతిరత్నాలు తర్వాత అనుదీప్ దర్శకత్వంలో సినిమా అనగానే తెలుగు ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ ఉంది.కనుక ఈ సినిమా కు ఖచ్చితంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ ఇక్కడ అయ్యే అవకాశం ఉంది.
మరో వైపు తమిళంలో శివ కార్తికేయన్ కు ఉన్న మంచి క్రేజ్ కారణంగా అక్కడ కూడా భారీగా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల వారు మరియు తమిళ మీడియా సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.ఈసినిమా హిట్ అయితే ఖచ్చితంగా అనుదీప్ జాతిరత్నాల ను బీట్ చేసి పాన్ ఇండియా స్థాయి లో మంచి డైరెక్టర్ గా గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.







