యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ జాబితా తీస్తే అందులో అను ఇమ్మాన్యుయేల్( Anu Emmanuel ) కూడా ఉంటుంది.న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన ‘మజ్ను( Majnu )చిత్రం ద్వారా ఈమె ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరు ఎవరీ అమ్మాయి ఇంత చక్కగా ఉంది అని అనుకున్నారు.ఆ సినిమా హిట్ అవ్వడం తో ఈమెకి అవకాశాలు కూడా బాగానే వచ్చాయి.
ఏకంగా అల్లు అర్జున్ , పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశం ని సంపాదించింది ఈ హాట్ బ్యూటీ.కానీ ఈమె తలరాత ఏంటో అర్థం కావడం లేదు.
తొలిసినిమా ‘మజ్ను’ తర్వాత ఈమె చేసిన ప్రతీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.అయినా కూడా ఈమె కి క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించే అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో కెరీర్ లో పీడకల లాంటి సినిమా గా ‘అజ్ఞాత వాసి‘ చిత్రాన్ని అనుకుంటారు.అలాంటి చెత్త సినిమా హీరోయిన్ ఈమె.అలాగే అల్లు అర్జున్ కెరీర్ లో అతి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన చిత్రం ‘నా పేరు సూర్య’.ఆ సినిమాలో కూడా హీరోయిన్ ఈమెనే.
అలా చేసిన ఇద్దరి స్టార్ హీరోల కెరీర్స్ లో యాదృచ్చికంగా మాయని మచ్చ లాంటి సినిమాలను చేసింది అను ఇమ్మాన్యుయేల్.అయినప్పటికీ కూడా ఈమెకి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
గత ఏడాది ఈమె అల్లు శిరీష్ తో కలిసి ‘ఊర్వశివో.రాక్షసివో( Urvasivo Rakshasivo )’ అనే సినిమా చేసింది.
ఈ చిత్రం మంచి రివ్యూస్ ని సంపాదించింది కానీ, కమర్షియల్ గా ఇది కూడా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.ఇక రీసెంట్ గా తమిళ హీరో కార్తీ తో కలిసి ఈమె నటించిన ‘జపాన్‘ చిత్రం మరో డిజాస్టర్ గా నిల్చింది.
ఇలా కెరీర్ లో వరుసగా 9 డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు ఉన్నప్పటికీ ఈమె తన రెమ్యూనరేషన్ ని ఏమాత్రం తక్కించడానికి ఇష్టపడడం లేదట.ఒక్కో సినిమాకి ఈమె రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటుంది.మీడియం రేంజ్ బడ్జెట్ సినిమా మేకర్స్ ఈమెని సంప్రదించి తమ సినిమాల్లో హీరోయిన్ గా పెట్టుకుందాం అంటే, రెండు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చెయ్యడం తో పాటుగా కోటి రూపాయిల అడ్వాన్స్ చెక్ కూడా అడుగుతుంది అట.ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.వరుస ఫ్లాప్స్ వచ్చిన తర్వాత కూడా అను ఇంత బెట్టు చెయ్యడం సరికాదు.ఇలా అయితే ఆమె కెరీర్ క్లోజ్ ఐపోయినట్టే అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.