ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ స్నేహారెడ్డి బంజారాహిల్స్‌లోని రోడ్ నెం.11లో ఏర్పాటు చేసిన ఎస్‌ఆర్ జ్యువెలరీ ఎక్స్‌క్లూజివ్ స్టూడియోను బుధవారం నాడు టాలీవుడ్ నటి అను ఇమాన్యుయేల్, వికారాబాద్ జెడ్‌పీ చైర్‌పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు.జ్యువెలరీ డిజైనర్ స్నేహా రెడ్డి మాట్లాడుతూ, “SR జ్యువెలర్స్ మగువలకు అన్ని ముఖ్యమైన సందర్భాలకు తగ్గట్లుగా డైమండ్అం డ్ గోల్డ్ జ్యూవేలరీని డిజైన్ చేయడంలో తన ప్రత్యేకత అని అన్నారు.ఇక అలనాటి నిజాం ఆభరణాల తయారీలో నిజాం శైలిపై అవగాహన కలిగిన తమ బృందం ఊహకు అందని విధంగా అనేక విశిష్టమైన డిజైన్‌లను రూపొందించామన్నారు.
సిండికేటడ్ పోల్కీల నుండి నిజాం సట్లదా, నిజాం చోకర్స్ వంటి ఆభరణాలకు తమ డిజైన్లు ఆభరణాల ప్రియులందరికీ వన్‌స్టాప్ డెస్టినేషన్ గా నిలుస్తుందన్నారు.ఇక్కడి స్టూడియోలో విలువైన రత్నాలు, ప్రత్యేకమైన పచ్చలు, బ్రైడల్ సెట్‌లతో పాటు ప్రత్యేకమైన యాంటిక్ ఆభరణాలు ఒకే వేదికలో అందుబాటులో తీసుకువచ్చామన్నారు.
నటి అను ఇమాన్యుయేల్ మాట్లాడుతూ, ఇక్కడ ఉంచిన యాంటిక్ జ్యూవెలరీ కలెక్షన్స్ ఎంతో బాగున్నాయని, సందర్భాలకు అనుగుణంగా ఎంతో నైపుణ్యతో డిజైన్ చేసిన స్నేహారెడ్డి జ్యూవెలరీ ప్రత్యేకత కని అభివర్ణించారు.వ్యక్తిగతంగా తనకు మినిమాలిస్టిక్‌లు అండ్ సింపుల్ ఆభరణాలను వ్యక్తిగతంగా ఎంతో ఇష్టపడతానన్నారు.