అమెరికాలో అడుగుపెట్టిన ఒమిక్రాన్ .. తొలి కేసు నమోదు, ప్రజలకు ఫౌచీ కీలక సూచనలు..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన విలయాన్ని ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు.ఇంకా కొన్ని దేశాల్లో వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది.

దీనితోనే తలబొప్పికడుతున్న వేళ.ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో మరో కొత్త వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది.ఈ కొత్త వేరియంట్ డెల్టాను మించి వ్యాప్తి చెందే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే అన్ని దేశాలు సరిహద్దులను క్లోజ్ చేస్తున్నాయి.అయినప్పటికీ ఇది ఖండాలు దాటేస్తోంది.

తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోకి ఒమిక్రాన్ వేరియంట్ అడుగుపెట్టింది.ఈ విషయాన్ని స్వయంగా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ ప్రకటించింది.

Advertisement

గతనెల 22న దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి పాజటివ్‌ వచ్చిందని, అతనిలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.ఆ వ్యక్తి నవంబర్‌ 22న దక్షిణాఫ్రికా నుంచి కాలిఫోర్నియాకు వచ్చాడని, అదేనెల 29న అతనికి పాజిటివ్‌ వచ్చిందని వైట్‌హౌస్ తెలిపింది.

అతను వ్యాక్సినేషన్‌కు సంబంధించి రెండు డోసులు తీసుకున్నాడని అయినప్పటికీ ‘‘ఒమిక్రాన్’’ బారినపడ్డారని వెల్లడించారు.ఈ నేపథ్యంలో అతని సంబంధీకులకు చేసిన పరీక్షల్లో.

వారికి నెగెటివ్‌ వచ్చిందని వైట్‌హౌస్ తెలిపింది.మరోవైపు అమెరికాలో ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో చీఫ్‌ మెడికల్‌ అడ్వైజర్‌ ఆంథోనీ ఫౌచీ స్పందించారు.

పౌరులంతా వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ తీసుకోవాలని.అలాగే బూస్టర్‌ డోసు విషయంపైనా ఆలోచించాలని ఫౌచీ చెప్పారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.అటు అమెరికాతో పాటు సౌదీ అరేబియా, యూఏఈలలో కూడా తొలి ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

Advertisement

ఉత్తరాఫ్రికాకు చెందిన వ్యక్తికి ఈ వైరస్‌ సోకినట్లు సౌదీ తెలపగా.ఆఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళకు ఒమిక్రాన్‌ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని యూఏఈ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

తాజా వార్తలు