ఫౌచీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు...అడ్డంగా బుక్కయ్యాడా...

శకునం చెప్పే బల్లి కుడితలో పడిందట.అలా ఉంది ప్రస్తుతం అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని ఫౌచీ పరిస్థితి.

కరోనా మహమ్మారి మొట్ట మొదటి సారిగా ప్రపంచ వ్యాప్తంగా విసృతం అయిన సమయంలో అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ను ముందుగానే హెచ్చరించానని అయినా ట్రంప్ తన మాట వినలేదని, కరోనా అమెరికాలో ఇంతగా ప్రభలడానికి ప్రధాన కారకుడు ట్రంప్ అంటూ విమర్శించిన ఫౌచీ కి కరోనా రహస్యం అందరికంటే ముందుగానే తెలుసునని, ఈ మహమ్మారి చైనాలోని వ్యూహాన్ ల్యాబ్ నుంచీ వచ్చిందన్న విషయం కూడా తెలుసని దాదాపు ఓ నిర్ధారణకు వచ్చేశారు నిపుణులు.కరోనాతో జాగ్రత్తగా ఉండాలి, అంటూ ప్రపంచ దేశాలకు సుద్దలు చెప్పిన ఫౌచీ మహమ్మారి ప్రభావం గురించి ముందే తెలిసినా తేలు కుట్టిన దొంగలా ఉన్నారని, పైగా నీతి కబుర్లు చెప్పుకొచ్చారని, అసలు ఈ ప్రయోగాలు చేయడానికి చైనాకు పెద్ద ఎత్తున నిధులు అమెరికా ఇవ్వడం వెనుక ఫౌచీ హస్తం ఉందని కొన్ని మెయిల్స్ ద్వారా వెల్లడవడమే కాకుండా అందుకు తగ్గ ఆధారాలు కూడా ఉన్నాయంటూ రిపబ్లికన్ పార్టీ కి చెందిన సెనేటర్ రాండ్ పాల్ తెలిపారు.

అంతేకాదు అతి ముఖ్యంగా సమాచార హక్కు చట్టం ద్వారా అమెరికాలోని పలు వార్తా సంస్థలు ఫౌచీ మెయిల్స్ ను సంపాదించాయి అందులో చాలా విషయాలు ఫౌచీ కదలికలపై ఎన్నో అనుమానాలను కలిగిస్తున్నాయి.

Anthony Fauci Emails Reveal Friendship With Top Chinese Scientist , Trump, Wuha

అండర్సన్ అనే అంటువ్యాధుల నిపుణుడు ఫౌచీ తో కరోనా వైరస్ పరిణామాలపై అనుమానాలు ఉన్నాయని మెయిల్ ద్వారా చెప్పగా అందుకు బదులుగా ఫౌచీ నేను ఫోన్ లో మాట్లాడుతాను అంటూ దాటవేయడం అలాగే మరో మెయిల్ లో వ్యూహాన్ ల్యాబ్ నుంచీ వైరస్ వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసిన ఫౌచీ తాజాగా మాత్రం సెనేట్ విచారణలో చైనా పరిశోధకులను అనుమానించాల్సిన అవసరం లేదని తెలిపారు.అంతేకాదు.చైనా ఇమ్మ్యూనిటి సెంటర్ డైరెక్టర్ జార్జ్ తో మాట్లాడుతూ ఈ విషయం చాలా సంక్లిష్టంగా ఉందని మనం ఇద్దరం ఈ విషయం నుంచీ కలిసి బయట పడుదాం అంటూ తెలిపారు.

Advertisement
Anthony Fauci Emails Reveal Friendship With Top Chinese Scientist , Trump, Wuha

ఇదిలాఉంటే కరోనా వైరస్ చైనా వ్యూహాన్ ల్యాబ్ నుంచీ లీకయ్యిందని మొదటి సారిగా చెప్పిన లీ మెంగ్ యాన్ మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు.ఫౌచీ నుంచీ మెయిల్స్ ద్వారా బయటకు వచ్చిన విషయాలు చాలా తక్కువ అని అసలు విషయాలు చాలా ఉన్నాయని అవన్నీ ఫౌచీ కు అవేంటే బాగా తెలుసంటూ ఆమె ప్రకటించడంతో ఆమె వ్యాఖ్యల దిశగా అమెరికా వార్తా సంస్థలు సోదిస్తున్నాయని తెలుస్తోంది.

ఏది ఏమైనా అతి త్వరలో ఫౌచీ గుట్టు బయటపడుతుందని, ప్రపంచం ముందు దోషిగా ఫౌచీ నిలబడాల్సిన సమయం వస్తుందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు.

Advertisement

తాజా వార్తలు