ఢిల్లీ రెజ్లర్ల ఆందోళనలో మరో ట్విస్ట్

ఢిల్లీలో గత కొన్ని రోజులుగా రెజ్లర్లు నిరసన కార్యక్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

రెజ్లర్ల ఆందోళనలో కీలకంగా వ్యవహరిస్తున్న సాక్షి మాలిక్ నిరసనల నుంచి తప్పుకున్నట్లు వస్తున్న వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.

రెజ్లర్ల ఉద్యమం నుంచి తాను తప్పుకోలేదని సాక్షి మాలిక్ తెలిపారు.న్యాయం కోసం పోరాటంతో వెనక్కి తగ్గలేదన్నారు.

Another Twist In The Concern Of Delhi Wrestlers-ఢిల్లీ రెజ్�

సత్యాగ్రహంతో పాటు రైల్వేలో తన బాధ్యతను నిర్వర్తిస్తున్నానని వెల్లడించారు.ఈ క్రమంలో న్యాయం జరిగే వరకు తన పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేశారు.

కాగా మహిళా రెజ్లర్లపై భారత రెజ్లర్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ రెజ్లర్లు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు