కరోనాతో పొంచి ఉన్న మరో ముప్పు.. పరిశోధనలో వెల్లడైన షాకింగ్ న్యూస్.. !

ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరోనాను తేలికగా తీసుకుంటున్నట్లుగా కనిపిస్తుందట.ఈ వైరస్ అంటే మొదట్లో ఉన్న భయం ఇప్పుడు దాదాపుగా మాయం అయ్యినట్లుగా తెలుస్తుంది.

కానీ ప్రపంచం మరచినా, మనుషులను మాత్రం మరవలేకపోతున్న కరోనా ప్రజలను ఎన్ని రకాలుగా హింసించాలో అన్నీ దారుల్లో దాడి చేస్తుంది.ఇప్పటికే మానవుల్లో ఉన్న అన్ని అవయాల మీద తన ప్రభావం చూపిస్తున్న ఈ వైరస్ తాజాగా తన పనితీరును మరింతగా మెరుగుపరచుకుని ఈ సారి బెల్స్ పాల్సీ రూపంలో అటాక్ అవుతుందట.

Corona Patients Suffering With Bells Palsy, Corona Patients, Suffer, Bells Palsy

ఇంతకు ఈ బెల్స్ పాల్సీ అంటే ఏంటని ఆలోచిస్తున్నారా. బెల్స్ పాల్సీ అంతే ముఖ పక్షవాతం.

ఇక కరోనా వచ్చిన వారిలో గానీ, కోవిడ్ టీకా తీసుకున్నవారిలో గానీ ఈ వ్యాధి లక్షణాలు బయటపడటం కామనే అంటున్నారు యూనివర్శిటీ హాస్పిటల్ క్లీవ్‌ల్యాండ్ మెడికల్ సెంటర్, కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు.కానీ ఈ వ్యాధి బారిన అతి తక్కువ మంది పడతారని అంతలా భయపడవలసిన అవసరం లేదని వెల్లడించారు.

Advertisement
మచ్చలు లేని చర్మం కోసం... సముద్ర ఉప్పు ఎలా ఉపయోగించాలి

తాజా వార్తలు