కేసీఆర్ కు మ‌రో చిక్కు.. కొత్త‌గా 90 రోజుల భ‌యం?

ముఖ్యమంత్రి కేసీఆర్ కు జ్యోతిష్యం, జాతకాలపై అపారమైన నమ్మకం ఉంది.ఇక వాస్తుపై కెసిఆర్ కు ఉన్నంత విశ్వాసం మరే సీఎంకు ఉండదేమో.

 Another Problem For Kcr.. New Fear Of 90 Days? , Kcr, Problem For Kcr,secretar-TeluguStop.com

కెసిఆర్ కు వాస్తు పిచ్చి ఎక్కువగా ఉందని భయంతోనే సచివాలయానికి వెళ్లడం లేదని.విపక్షాలు ఎంతగా విమర్శించిన ఆయన పట్టించుకోవడంలేదని తెలుస్తుంది.

అభ్యంతరాలు ,ఆరోపణలు వెల్లువెత్తిన కొత్త సచివాలయం నిర్మాణం కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు.

హైదరాబాదులోని పలు ప్రాంతాలను పరిశీలించారు.

విపక్షాలు విమర్శించిన.కోర్టు మొట్టికాయలు వేసిన కేసీఆర్ లెక్క చేయలేదు.

చివరకు పాత సచివాలయాన్ని కూలగొట్టి కొత్త నిర్మాణాలకు పూనుకున్నారు.పరిపాలన వ్యవస్థలతో ఐకాన్ భవనంగా సచివాలయాన్ని నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు.

ఇందుకోసం వాళ్ళు డిజైన్లను పరిశీలించారు.నిర్మాణ కాంట్రాక్టును కమాండ్ కంట్రోల్ భవనాన్ని నిర్మించిన షాపూజి పల్లోజీ సంస్థనే దక్కించుకుంది.

ఇది కొత్త సచివాలయాన్ని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సకల సదుపాయాలతో నిర్మించాలని నిర్ణయించారు.

Telugu Fear, Prashanth Reddy, Problem Kcr, Trs-Political

ఇందుకోసం ఏకంగా 1000 కోట్ల రూపాయలు నిధులను కేటాయించారు.దాంతో సచివాలయ భవనం ను కేవలం రెండు సంవత్సరాల ఎవరిలో పూర్తి చేయాలని ముందుగా భావించారు.అయితే కరోనా ఇతర కారణాల కారణంగా నిర్మాణం వాయిదా పడింది.

సచివాలయానికి వెళ్లే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి.మరోవైపు నిర్మాణ అంచనాలు కూడా పెరిగాయి.

దాంతో అనుకున్న సమయానికి సచివాలయ భవనం పూర్తవుతుందా అనే సంశయాలు టిఆర్ఎస్ పార్టీ వర్గాలను చుట్టుముట్టాయి.ఆ తర్వాత కరోనా తగ్గుముఖ పట్టడంతో నిర్మాణ పనులు మొదలయ్యాయి.

వేగం కూడా పెరిగింది.అయితే ఇప్పుడు మరో చిక్కు వచ్చిందంట.

ఇక పనులు పూర్తి ప్రారంభంతో పాటు పాలన విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జ్యోతిష్యాల సూచనలు చేశారట.లేదంటే చిక్కులు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారట.

Telugu Fear, Prashanth Reddy, Problem Kcr, Trs-Political

సహజంగానే వాస్తులు, దోషాలు, యజ్ఞ యాగాలను ఎక్కువగా నన్నే కెసిఆర్ కు జ్యోతిష్యులు చెప్పిన మాటలు టెన్షన్ పుట్టిస్తున్నాయంట.ఆయనకు కొత్తగా 90 రోజుల భయం పట్టుకుందట.అనుకున్న సమయానికి సచివాలయం ప్రారంభించాలన్న జ్యోతిష్యులు మాటలపై కేసీఆర్ సీరియస్ గా దృష్టి పెట్టారు.దసరాకు కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని అక్కడ నుంచి 90 రోజులపాటు పరిపాలన చేసి అనంతరం ముందస్తు ఎన్నికలకు వెళ్తే కెసిఆర్ కు అనూహ్య విజయం చేకూరుతుందని జ్యోతిష్యులు చెప్పారట.

దీంతో ఎలాగైనా ఈ విజయదశమిలోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలి అని లేదంటే కనీసం తన ఛాంబర్ అయినా సిద్ధం చేయాలని అధికారులను కెసిఆర్ ఆదేశించారని తెలుస్తోంది.దీనికోసం మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇతర కార్యక్రమాలను పక్కనపెట్టి సెక్రటేరియట్ పనులపై మాత్రమే నిమగ్నమయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube