జనసేనపై మరో కుట్ర.. నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు

ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పేరుతో జనసేనపై మరో కుట్రకు తెర తీశారని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ కుట్రపై డీజీపీ విచారణ జరిపించాలని ఆయన కోరారు.

ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటమే జనసైనికులకు తెలుసని నాదెండ్ల తెలిపారు.జన సైనికులు, వీర మహిళలు కలిసి వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

జనసేనకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి అసూయతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.వచ్చే ఎన్నికల్లో గెలుపెవరిదో ప్రజలే తేలుస్తారని నాదెండ్ల స్పష్టం చేశారు.

మన ఇంటి ఆనంది మనోళ్లకు పెద్దగా నచ్చలేదు.. జాంబిరెడ్డి హీరోయిన్ ఆనంది గురించి ఆసక్తికర విషయాలు
Advertisement