నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌ను ఇటీవల తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే.మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు బాలయ్య రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాతో బోయపాటి శ్రీను తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఎంతో కసిగా ఉన్నాడు.
ఇక పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్న బోయపాటి, ఈ సినిమాలో బాలయ్యను రెండు విభిన్న పాత్రల్లో మనకు చూపించనున్నాడు.ఈ క్రమంలో ఈ సినిమాలోని బాలయ్య చేస్తున్న రైతు పాత్రకు సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
కాగా ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ ఎవరనే విషయంపై గతకొద్ది రోజులుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ హీరోయిన్‌గా తెలుగు బ్యూటీ అంజలిని ఎంపిక చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట.
గతంలో డిక్టేటర్ చిత్రంలో బాలయ్యతో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ, మరోసారి బాలయ్య సరసన నటిస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావించింది.
కానీ చిత్ర యూనిట్‌ను అవాక్కయ్యేలా చేస్తూ అంజలి ఈ సినిమాలో నటించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.
బాలయ్య సరసన డిక్టేటర్ చిత్రంలో నటించినా తనకు పెద్దగా గుర్తింపు రాలేదని అంజలి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఏదేమైనా బాలయ్య లాంటి స్టార్ హీరో సినిమాను అంజలి రిజెక్ట్ చేసిందనే వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
మరి ఈ వార్త ఆమెకు ఎలాంటి రియాక్షన్‌ను తీసుకొస్తుందా అని ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు చూస్తున్నారు.ఇక బాలయ్య సరసన ఈ సినిమాలో మలయాళ కుట్టి ప్రగ్యా మార్టిన్‌ను తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయాల్సిందే.







