కొన్ని సంవత్సరాల క్రితం యూట్యూబ్( YouuTube ) లో సంచలనం సృష్టించిన సాంగ్స్ లో అనితా ఓ అనితా( Anitha O Anitha Song ) ఒకటి.ఈ సాంగ్ రచయిత పేరు నాగరాజు అనే సంగతి తెలిసిందే.తాజాగా నాగరాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.2008లో అనిత సాంగ్ రిలీజైందని ఒకటే పాటతో ఊహించని స్థాయిలో సక్సెస్ దక్కిందని ఆయన పేర్కొన్నారు.డిగ్రీలో ఉన్న సమయంలో నాకు నచ్చిన అమ్మాయి పేరు అనిత అని నాగరాజు తెలిపారు.
ఆ అమ్మాయి మధ్యలో హ్యాండ్ ఇవ్వడంతో ఆ పాట రాశానని ఆయన వెల్లడించారు.
నేను ఆర్కెస్ట్రా సింగర్ అని నాగరాజు( Nagaraju ) అన్నారు.పాట రిలీజైన ఏడాది తర్వాత ఈ పాట ఫేమస్ అయిందని ఆయన పేర్కొన్నారు.
ఈ పాట రాసిన అబ్బాయి చనిపోయాడని కొందరు అమ్మాయి చనిపోయిందని కొందరు అనుకున్నారని అయితే ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని నాగరాజు కామెంట్లు చేశారు.
మౌత్ పబ్లిసిటీ( Mouth Publicity ) వల్ల ఆ సాంగ్ పాపులర్ అయిందని ఆయన పేర్కొన్నారు.అనితా ఓ అనితా సాంగ్ రాసింది నేనే అయినా ఆ పాట రచయిత నేనేనని తెలియదని నాగరాజు చెప్పుకొచ్చారు.నేను ప్రేమించిన అమ్మాయి వినాలని పాట రాశానే తప్ప ఈ పాటతో డబ్బులు సంపాదించుకోవాలని అనుకోలేదని ఆయన కామెంట్లు చేశారు.
నాకు అవకాశాలు రావడం వాస్తవమే అని నాగరాజు వెల్లడించడం గమనార్హం.
నా రియల్ స్టోరీ( Real Story )ని బేస్ చేసుకుని ఒక సినిమా వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.అనితా ఓ అనితా సాంగ్ కు మరో వెర్షన్ రాస్తున్నానని నాగరాజు తెలిపారు.నా పెద్దబ్బాయికి మాటలు రావని చిన్నబ్బాయి కూడా మాట్లాడలేకపోతున్నాడని ఇది నాకు బాధ అని ఆయన పేర్కొన్నారు.
అనిత హ్యాండ్ ఇవ్వడం వల్లే ఈ స్థాయికి వచ్చానని ఆయన కామెంట్లు చేశారు.