'బ్రో' టైటిల్ ని వదిలింది పవన్ కళ్యాణ్ కోసం కాదు ..అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్!

నందమూరి బాలకృష్ణ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) బ్లాక్ బస్టర్ టాక్ తో దసరా విన్నర్ గా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సినిమాలో బాలయ్య బాబు ని ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని కోణం లో చూపించి, శబాష్ అనిపించాడు అనిల్ రావిపూడి( Anil Ravipudi ).

అంతే కాదు చాలా కాలం తర్వాత బాలయ్య సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కట్టింది ఈ చిత్రానికే.ఇందులో బాలయ్య మార్క్ మాస్ ఉంటూనే అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ మరియు సెంటిమెంట్ సమపాళ్లలో మిక్స్ చేసారు.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి క్యాప్షన్ ఐ డోంట్ కేర్ గురించి డైరెక్టర్ అనిల్ రావిపూడి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ప్రత్యేకించి మాట్లాడాడు.ఈ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ బ్రో - ఐ డోంట్ కేర్ అట.

Anil Ravipudis Shocking Comments About Bro Title , Anil Ravipudi , Bro Title ,

చాలా మంది ఈ టైటిల్ ని పవన్ కళ్యాణ్ సినిమా కోసం బాలయ్య బాబు వదిలేసాడు అని అనుకున్నారు.ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన బ్రో ది అవతార్ చిత్రం విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజి గా ఆడి వెళ్లిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ టైటిల్ ని వదులుకోవడానికి అసలు కారణం అది కాదట.

Advertisement
Anil Ravipudis Shocking Comments About Bro Title , Anil Ravipudi , Bro Title ,

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ మేము ఈ చిత్రానికి ముందు అనుకున్న టైటిల్ బ్రో( Bro ).ఏడాది క్రితమే రిజిస్టర్ చెయ్యించాము, కానీ ఎందుకో బాలయ్య సినిమాకి ఈ టైటిల్ కరెక్ట్ కాదేమో అని అనిపించింది.ఆయన ఫిల్మోగ్రఫీ ఒకసారి చూసుకుంటే అన్నీ పవర్ ఫుల్ టైటిల్స్ ఉంటాయి.

సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు, లెజెండ్ , అఖండ ఇలాంటి టైటిల్స్ కి అలవాటు పడిన అభిమానులకు బ్రో టైటిల్ అంతగా ఇక్కడేమో అని అనిపించింది, అందుకే మార్చేసాము అని చెప్పుకొచ్చాడు.

Anil Ravipudis Shocking Comments About Bro Title , Anil Ravipudi , Bro Title ,

అనిల్ రావిపూడి ఇచ్చిన ఈ క్లారిటీ తో ఇన్ని రోజులు ప్రచారమైన పవన్ కళ్యాణ్ కోసం బ్రో టైటిల్ ని బాలయ్య వదులుకున్నాడు అనే రూమర్ కి చెక్ పడింది.ఇకపోతే భగవంత్ కేసరి చిత్రం ఇప్పటి వరకు సుమారుగా 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.మొదటి వారం 45 కోట్ల షేర్ మార్కుని దాటొచ్చని, ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ సినిమా 55 కోట్లు షేర్ దాటుతుందని అంటున్నారు.

కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 65 కోట్ల రూపాయలకు జరిగింది.కాబట్టి కమర్షియల్ గా ఈ సినిమా యావరేజి గా మిగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు