ఈ రెండు క్లాసిక్ సినిమాలను టచ్ చేయాలని ఉందంటున్న అనిల్ రావిపూడి!

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి వరుస హిట్ సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.

ఈయన పటాస్ మొదలుకుని ఇప్పుడు వచ్చిన ఎఫ్ 3 సినిమా వరకు అన్ని కూడా సూపర్ హిట్ సినిమాలనే తెరకెక్కించాడు.

సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ ఈ స్థాయికి చేరుకున్నాడు.ప్రెసెంట్ తెరకెక్కించిన సినిమా ఎఫ్ 3.ఈ సినిమా ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వచ్చింది.ఇందులో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు.

వీరిద్దరికి జోడీగా తమన్నా భాటియా, మెహ్రీన్ నటిస్తున్నారు.దేవిశ్రీ సంగీతం అందించగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో ఈ సినిమాను శిరీష్ నిర్మించారు.

ఇక ఈ సినిమా ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.మరోసారి తన కామెడీ తో ప్రేక్షకులను అలరించాడు.

Advertisement

అయితే ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా అనిల్ తన మనసులోని మాటను బయట పెట్టాడు.మన టాలీవుడ్ లోని రెండు క్లాసిక్ సినిమాల తరహాలోనే చక్కని సినిమాలను తెరకెక్కించాలని ఉందట.ఇంతకీ ఆ రెండు క్లాసిక్ సినిమాలు ఏంటో తెలుసా.

అలనాటి సూపర్ హిట్ సినిమాలు అయినా మాయాబజార్, జగదేక వీరుడు అతిలోక సుందరి.ఈ రెండు సినిమాల తరహా కుటుంబ కథ సినిమాలను ఈయన తెరకెక్కించాలని ఆశ పడుతున్నాడు.

జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సోషియో ఫాంటసీ మూవీ.మాయా బజార్ లాంటి ఫ్యామిలీ మూవీని తీయాలని తన డ్రీమ్ ని బయట పెట్టేసాడు.అయితే ఇలాంటి ఎవర్ గ్రీన్ సినిమాలను టచ్ చేసే అంత సాహసం ఇప్పటి వరకు ఎవ్వరు చేయలేదు.

జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ తీస్తానని చెప్పిన అశ్వనీ దత్ వల్ల కూడా ఇది సాధ్యం అవ్వలేదు.చిరు, చరణ్ తో ఈ సీక్వెల్ తీస్తానని చెప్పిన అది సాధ్యపడలేదు.

వావ్‌ : ఒక్క ఆసనంతో ఇన్ని ఉపయోగాలా?

మరి ఈయనకు సీక్వెల్ ఛాన్స్ వస్తే చేయాలనీ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

తాజా వార్తలు