కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!!

Anil Kumar Yadav's Sensational Comments On Kotam Reddy Sridhar Reddy , Anil Kumar Yadav, Kotam Reddy Sridhar Reddy , Nellore District, Jagan Mohan Reddy

నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది.తనను అవమానించారని ఫోన్ ట్యాపింగ్ చేశారని.

 Anil Kumar Yadav's Sensational Comments On Kotam Reddy Sridhar Reddy , Anil Kuma-TeluguStop.com

ప్రభుత్వాధికారులపై వైసీపీ పెద్దలపై సీరియస్ ఆరోపణలు చేయడం తెలిసిందే.కాక ఈరోజు ఉదయం మీడియా సమావేశం నిర్వహించి తనని మరియు తన బిడ్డలని.

  అనిల్ కుమార్ యాదవ్ శపించారని దూషించారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు.ఈ క్రమంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.

తాను ఎక్కడా కూడా కోటంరెడ్డి పిల్లల గురించి తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు.ఈ సమయంలో గతంలో తాను చేసిన వ్యాఖ్యల వీడియో మీడియా సమావేశంలో వినిపించారు.

ఆ వీడియోలో జగన్ మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను మోసం చేస్తే.నాకు కాదు నా బిడ్డలను కూడా భగవంతుడు క్షమించడు.

అని తాను అన్నట్లు వివరణ ఇచ్చారు.

Telugu Kotamreddy, Nellore-Telugu Political News

అయితే తాను ఎక్కడ కూడా కోటంరెడ్డి బిడ్డలపై వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.కోటంరెడ్డితో కలిసి దాదాపు 12 సంవత్సరాలు రాజకీయాలు చేయడం జరిగింది.ఎన్నో ఎత్తుగడలు.

ఇద్దరం కలిసి వేసాం.ఆయన ఏంటో నాకు బాగా తెలుసు.

చాలాసార్లు ఆయన ముందే చెప్పాను.నువ్వు మహానటుడివి.

పొరపాటున రాజకీయాల్లోకి వచ్చావు.నువ్వు గాని సినిమా రంగంలోకి వెళ్లి ఉంటే ఎస్వీ రంగారావు, కోటా శ్రీనివాసరావు.

మైమరిపించే వాడివి.ఈ క్రమంలో నా తమ్ముడు నా బిడ్డలను ఇలా అన్నాడు అంటూ కోటంరెడ్డి సింపతి సంపాదిస్తున్నాడు.

ఆ వీడియోలో… నా బిడ్డలను ఉద్దేశించి అన్నానే తప్ప అతని బిడ్డల గురించి మాట్లాడలేదని.అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube