దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగిన నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్నప్పటికీ ఈమె ఇండస్ట్రీలో అగ్ర తారగా కొనసాగుతున్నారు.
లేడీ సూపర్ స్టార్ అని బిరుదు తీసుకున్న నయనతార ఏకంగా ఒక్కో సినిమాకు 7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ అగ్రతారగా కొనసాగుతున్నారు.ఇకపోతే తాజాగా బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ టాక్ షోలో భాగంగా సమంత హీరో అక్షయ్ కుమార్ తో కలిసి పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.
ఈ కార్యక్రమంలో భాగంగా కరణ్ సమంతను ఎన్నో ప్రశ్నలు అడిగి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు.ఇకపోతే సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న వేశారు.
ఈ ప్రశ్నకు సమంత సమాధానం చెబుతూ నయనతార అని చెప్పడమే కాకుండా తనతో పాటు కలిసిన సమంత నటించిన కాత్తు వాక్కుల రెండు కాదల్ సినిమా గురించి చెప్పుకొచ్చారు.ఈ విధంగా సౌత్ ఇండియాలో నయనతార నెంబర్ వన్ హీరోయిన్ అని సమంత చెప్పగా కరణ్ మాత్రం వెల్ నాట్ ఇన్ మై లిస్ట్ అంటూ ఆర్మాక్స్ మీడియా సర్వేలో భాగంగా విడుదల చేసిన జాబితాను డిస్ ప్లే చేశారు.
ఈ జాబితాలో సమంత అగ్రస్థానంలో ఉంది.

ఈ విధంగా కరణ్ సౌత్ ఇండియాలో సమంత మొదటి స్థానంలో ఉంది నయనతార కాదంటూ తనని తక్కువ చేసి మాట్లాడారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై నయనతార అభిమానులు పెద్ద ఎత్తున కరణ్ జోహార్ నీ భారీగా ట్రోల్ చేస్తున్నారు.నయనతార స్టార్ డమ్ చూసి అతనికి కుళ్ళు వచ్చేసింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రియాంక చోప్రా కరీనాకపూర్ దీపిక వంటి వాళ్ళు ఎలాగో సౌత్ ఇండియాలో నయనతార అలాగా అంటూ కొందరు కామెంట్లు చేయక మరికొందరు నయనతార అంటే ఎందుకు అంత చులకన అలా తీసి పడేసావు అంటూ మరికొందరు ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు.







