శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని ముట్టడించిన అంగన్వాడి వర్కర్లు.ఎమ్మెల్యే ఇంటి ముందు భైటాయించి ఆందోళన చేపట్టిన అంగన్వాడి వర్కర్లు.
ఆందోళన చేపట్టిన అంగన్వాడి వర్కర్లతో ఫోన్ చేసి మాట్లాడిన ఎమ్మెల్యే బాలకృష్ణ.రెండు వారాల నుంచీ మీరు రోడ్డెక్కి ఆందోళన చేపట్టి ఒక విప్లవం తీసుకొచ్చారు.
పాదయాత్రలో మీసమస్యలు పరిష్కరిస్తానని మాయ మాటలు చెప్పి జగన్ మోసం చేశారు.ఒక్క చాన్స్ ఇవ్వండి అని రాష్ట్రాన్ని అదోగతిపాలు చేసింది ఈ ప్రభుత్వం.
మరోసారి మోసపోకండి వచ్చేది మన ప్రభుత్వమే మీ సమస్యలన్నింటిని పరిష్కరిస్తాము.
మహిళలకు రిజర్వేషన్ కల్పించి వారి అబివృద్దికి దోహదం చేసింది టిడిపి ప్రభుత్వమే అన్నారు.
మీ విప్లవాన్ని ఆపద్దండి రెండు మూడు నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది మీకు నేను అండగా ఉంటానని మాట ఇచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణ.ప్రజలకు నేను ఒకటే చెబుతున్నా ఉచిత పథకాలు ఉచిత హామీలను నమ్మి మరోసారి మోసపోకండి.
వచ్చే వారంలో హిందూపురానికి వస్తాను అప్పుడు మీతో కలసి మాట్లాడుతా.ఎమ్మెల్యే ఫోన్ చేసి మాట్లాడి మీపోరాటానికి మద్దతిస్తానని మాట ఇవ్వడంతో ఆందోళన విరమించిన అంగన్వాడి వర్కర్లు.