కేసీఆర్‌కు సడెన్ షాక్ ఇచ్చిన జగన్.. ఇక మాటల యుద్దం తప్పదా?

తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాల వివాదం ఇంకా కొనసాగుతునే ఉంది.తాజాగా తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్‌కు షాక్ ఇస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.

 Andhra Pradesh Moves Supreme Court Seeking Division Of Assets With Telangana,kcr-TeluguStop.com

 తెలంగాణ ప్రభుత్వం ఆస్తుల పంపకంలో జాప్యం చేస్తోందని,  ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్వవహరిస్తుందంటూ ఏపీ ప్రభుత్వ పెద్దలు ఆరొపిస్తున్నారు.ఇనాళ్ళు వేచి చూసే ధోరణి అవలంభించిన  ఏపీ ఇది తన హక్కులకు భంగం కలిగించడమేనని బావించి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ప్రస్తుతం  ఏపీకి ఇవ్వాల్సిన ఆస్తుల్లో 91 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొంది. విభజన జరిగి ఎనిమిదేళ్లు అయిన  తెలంగాణ ప్రభుత్వం ఆస్తుల పంపకాలను అడ్డుకుంటున్నదని ఆరోపించింది.ఈ విషయంలో  జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం అభ్యర్థించింది. 1.42 లక్షల కోట్ల విలువైన ఆస్తుల పంపిణీలో తెలంగాణ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 21 ప్రకారం ఏపీ ప్రజలకు హక్కుగా రావాల్సిన వాటిపై తెలంగాణ ఉల్లంఘించిందని తెలిపింది.  సాటి తెలుగు  రాష్ట్రం  విషయంలో మంచిగా ఉండాలని ఎంత  ప్రయత్నించినా తెలంగాణ మొండి వైఖరి అవలంబించిందని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.ఏపీ విభజన చట్టంలోని 10వ షెడ్యూల్‌ ప్రకారం  జనాభా ప్రాతిపదికన సంస్థలకు సంబంధించి నగదు నిల్వలను మాత్రమే పంచుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి.

 అయితే ఈ క్లాజుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వాన్ని కోరగా, ఈ కేసు పెండింగ్‌లో ఉంది.

ఆపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీలాభిడే నిపుణుల కమిటీ 9వ షెడ్యూల్‌లోని 90 సంస్థలపై కేంద్రానికి నివేదికలు సమర్పించింది. విభజన సమస్యలను పరిష్కరించడంలో  కేంద్రం మూగ ప్రేక్షకుడిలా వ్యవహరించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube