ఏ రాజకీయ పార్టీ అయినా సరే కొన్ని వర్గాల మీద ఆధార పడక తప్పదు.జిల్లాల వారీగా అక్కడ బలంగా ఉన్న సామాజిక వర్గాల నేతలను ఆధారంగా చేసుకునే అధికారంలోకి వస్తుంది.
ఇప్పటికే ఈ విషయం టీడీపీ, వైసీపీలను చూస్తుంటేనే అర్థం అవుతుంది.కాగా ఇప్పుడు ఆయా జిల్లాల వారీగా టీడీపీకి చెక్ పెట్టేందుకు వైసీపీ రెడీ అవుతోంది.
ఇందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో మాస్టర్‌ప్లాన్ వేస్తోంది.ఈ జిల్లాలో టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు లాంటి వారంతా బలమైన నేతులుగా ఉన్నారు.
వీరికి చెక్ పెట్టేందుకు కాపులను ఎంకరేజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
ఇక రాబోయే కాలంలో జనసేన బలంగా మారే అవకాశాలు ఉన్నాయన్న వార్తలతో జగన్ అలర్ట్ అయ్యారు.
తూర్పు జిల్లాల్లో ఎక్కువగా కాపుల సామాజిక వర్గం ఆర్థికంగా, బలంగా ఉంది.కాబట్టి వారిని తనవైపు తిప్పుకునేందుకు జగన్ రెడీ అయిపోయారు.ఇందులో భాగంగానే విక్రాంత్ కు ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు.ఇప్పటికే పాలవలస కుటుంబానికి ఈ జిల్లాలో మంచి పట్టు ఉంది.
కాబట్టి వారిని మరింత బలంగా తయారు చేసేందుకు జగన్ రెడీ అవుతున్నారు.కాపు ఓటర్లను తనవైపు తిప్పుకుంటే పవన్‌కు చెక్ పెట్టొచ్చని ఆలోచిస్తున్నారు జగన్.

ఇక టీడీపీ నుంచి బలంగా ఉన్న అచ్చెన్నాయుడు ఫ్యామిలీకి చెక్ పెట్టేందుకు ఇక్కడ కాపులకు పెద్ద పీట వేస్తున్నట్టు తెలుస్తోంది.అదే గాక విశాఖ జిల్లాలో కూడా టీడీపీకి చెక్ పెట్టేందుకు జగన్ ప్లాన్ వేస్తున్నారంట.ఇందులో భాగంగా ఈ జిల్లా నుంచి మళ్లీ కాపులకే మంత్రులుగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది.ఇలా జగన్ ప్లాన్ చూస్తే ప్రస్తుతం టీడీపీకి, రాబోయే కాలంలో జనసేనలకు చెక్ పెడుతున్నట్టు తెలుస్తోంది.
ఏదేమైనా జనగ్ ప్లాన్ చూస్తుంటే టీడీపీ, జనసేనలకు చిక్కులు తప్పవని అర్థం అవుతోందన్న మాట.