అక్కడ జయమ్మ పంచాయతీకి వస్తున్న రెస్పాన్స్‌ ఏంటో తెలుసా..!

యాంకర్ సుమ జయమ్మ గా మారి చేసిన సినిమా జయమ్మ పంచాయితీ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

సుమకు ఉన్న క్రేజ్ తో ఏ స్థాయిలో సినిమా ను ప్రమోట్ చేశారో చూశాం.

దాంతో సినిమా కు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది.అద్బుతమైన సినిమా అయ్యి ఉంటుంది అంటూ చాలా మంది బలంగా నమ్మారు.

కాని సినిమా విషయంలో విడుదల అయిన తర్వాత అసలు విషయం క్లారిటీ వచ్చింది.జయమ్మ పంచాయితీ కి అంత సీన్ లేదు అంటూ ప్రేక్షకులు తిప్పి కొట్టారు.

సినిమా విడుదల అయ్యి వారాలు గడుస్తున్నా కూడా ఏంటీ ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవ్వడం లేదు అంటూ అంతా ఎదురు చూస్తున్న సమయంలో ఎట్టకేలకు ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అయ్యింది.అమెజాన్ ప్రైమ్‌ లో ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

Advertisement

అమెజాన్ వారు ఈమద్య కాలంలో తెలుగు సినిమా లపై ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా ఉన్నారు.మెజార్టీ సినిమా లను ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు.

తాజాగా సుమ క్రేజీ మూవీ జయమ్మ పంచాయితీని కూడా కొనుగోలు చేయడంతో అమెజాన్ ఖాతాదారులకు ఫుల్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ ను అందించారు.ఈ సినిమా ను చాలా మంది బాగా లేకున్నా ఒక సారి చూడాలని ఆశ పడుతున్నారు.

ఎందుకంటే సుమ యాంకర్‌ గా బుల్లి తెరపై ఒక స్టార్‌.ఆమె ను వెండి తెరపై అదే సినిమాలో చూడాలని చాలా అనుకున్నారు.

కాని సినిమా థియేటర్‌ కు వెళ్లి చూడటానికి కుదరక పోవడం వల్ల ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేసేందుకు సిద్ధం అయ్యారు.కనుక థియేటర్‌ లో చూసిన వారి కంటే ఓటీటీ లో చూసే వారి సంఖ్య దాదాపుగా మూడు రెట్లు అధికంగా ఉంటుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Cool Bet Im Überblick : Wie Die Marke Funktioniert Und Was Spieler Wissen Sollten
సెక్స్ కోసం మహిళలు వయాగ్ర వాడాల్సిన పని లేదు

కనుక అమెజాన్ లో ఈ సినిమా దుమ్ము రేపడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement