స్టార్ యాంకర్ శ్రీముఖి పెళ్లి గురించి ఈ మధ్య కాలంలో ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.అయితే ఆ వార్తలు నిజం కాలేదు.
ఇప్పుడు మాత్రం శ్రీముఖి పెళ్లి ఖచ్చితంగా జరగనుందని త్వరలో అధికారికంగా శ్రీముఖి పెళ్లి ప్రకటన కచ్చితంగా రానుందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.శ్రీముఖికి పెళ్లి ఫిక్స్ అయిందని ఆమె సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది.
ప్రముఖ వ్యాపారవేత్తతో శ్రీముఖి డేటింగ్ లో ఉన్నారని బోగట్టా.ఆ వ్యాపారవేత్తకు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని సమాచారం అందుతోంది.శ్రీముఖితో పెళ్లికి ఆ వ్యాపారవేత్త కుటుంబం కూడా అంగీకరించిందని తెలుస్తోంది.త్వరలో శ్రీముఖి తాను పెళ్లి చేసుకునే వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఇటీవల కొత్తిల్లు కొని గృహప్రవేశం చేసిన శ్రీముఖి పెళ్లికి సంబంధించిన శుభవార్త చెబితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే సంగతి తెలిసిందే.శ్రీముఖి వయస్సు 29 సంవత్సరాలు కాగా ఆమె హోస్ట్ గా వ్యవహరించిన ఎన్నో షోలు అంచనాలకు మించి సక్సెస్ అయ్యాయి.కొన్ని నెలల క్రితం వరకు బొద్దుగా కనిపించిన శ్రీముఖి ప్రస్తుతం స్లిమ్ లుక్ లో దర్శనమిస్తున్నారు.
పెళ్లి తర్వాత శ్రీముఖి యాంకర్ గా కెరీర్ ను కొనసాగిస్తారా? లేదా? అనే ప్రశ్నలకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.శ్రీముఖి పెళ్లి చేసుకుంటే తమ హార్ట్స్ బ్రేక్ అవుతాయని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.శ్రీముఖి పెళ్లి వార్త ఈసారైనా నిజం కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
గతంతో పోల్చి చూస్తే శ్రీముఖికి ఆఫర్లు తగ్గగా అడపాదడపా షోలతో ఆమె బుల్లితెరపై సందడి చేస్తున్నారు.కెరీర్ ను శ్రీముఖి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారో తెలియాల్సి ఉంది.