కరోనా ఎఫెక్ట్: నిరాశకు లోనైన యాంకర్.. ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో యాంకర్ నుండి హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు.వారిలో కొంతమంది సక్సెస్ కాగా మరికొంత మంది ఫెయిల్ అయ్యారు.

దీంతో వారు మళ్లీ తమ యాంకరింగ్ పనులు చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు.అయితే తాజాగా యాంకర్ నుండి హీరోగా మారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూసి సినిమా రిలీజ్ కాకముందే నిరాశకు లోనయ్యాడు ఓ యాంకర్.

తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు యాంకర్ ప్రదీప్.కొన్నేళ్లుగా యాంకరింగ్ చేస్తూ తనదైన మార్క్‌ను వేసుకున్న ఈ యాంకర్ ఇప్పుడు హీరోగా మారాడు.‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా.?’ అనే సినిమాతో హీరోగా మారిన ప్రదీప్, ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.ఇక అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన ఈ సినిమాకు కరోనా మహమ్మారి అడ్డంకిగా మారింది.

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రస్తుతం లాక్‌డౌన్ ప్రకటించారు.దీంతో మార్చి 31న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది.ఇక ఈ లాక్‌డౌన్‌ను ఎప్పుడు ఎత్తేస్తారో ఇప్పట్లో తేలేలా లేదు.

Advertisement

దీంతో ఈ సినిమా రిలీజ్ ఎప్పుడుంటుందనే విషయం కూడా క్లారిటీగా చెప్పలేని పరిస్థితి.ఇలా హీరోగా మారిన తనకు కరోనా దెబ్బేసిందని ప్రదీప్ అంటున్నాడు.

మధుమేహం ముప్పు ఎలా పెరిగిపోతున్న‌దంటే...
Advertisement

తాజా వార్తలు