పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan )నేడు పుట్టినరోజు ( Birthday) వేడుకలను జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో సోషల్ మీడియా మొత్తం పవన్ కళ్యాణ్ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు తోటి నటీనటులు పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన రేర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో పవన్ పేరు ట్రెండ్ అవుతుంది.

ఇలా నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు జరుపుకోవడంతో సినిమా సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక ఈయన జనసేన పార్టీని స్థాపించి జనసేన అధినేతగా రాజకీయాలలో కూడా ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉండగా ఒకప్పటి బుల్లితెర యాంకర్ ప్రస్తుత వెండితెర నటి అనసూయ( Anasuya ) సైతం పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అనసూయ గతంలో జబర్దస్త్ కార్యక్రమంలో భాగంగా యాంకరింగ్ చేస్తున్నటువంటి ఒక వీడియో క్లిప్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశారు.ఇందులో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో చెప్పే డైలాగ్ రావడం లేట్ అవే వచ్చేమో కానీ రావడం మాత్రం పక్క అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ మేనరిజంలో చెబుతూ ఉన్నటువంటి వీడియోని అనసూయ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్ అంటూ తనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అనసూయ తన స్టైల్ లో శుభాకాంక్షలు తెలియజేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే ఒకప్పుడు బుల్లితెర యాంకర్ గా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె అనంతరం సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా మారిపోయారు.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.
ఇలా సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే అనసూయ ఇక్కడ కూడా భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక ప్రస్తుతం ఈమె పుష్ప 2( Pushpa 2 )సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో అనసూయ దాక్షాయిని పాత్రలో కీలక పాత్ర పోషించిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది.







